Movies

రిషి కపూర్ రియల్ స్టోరీ… తండ్రి అప్పు తీర్చటానికి హీరోగా మారాడు

గొప్ప నటుడు ఇర్పాన్ ఖాన్ మరణించిన 24 గంటలు కూడా గడవక ముందే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్ ఈ రోజు ఉదయం తుది శ్వాస వదిలారు. బుధవారం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ముంబయిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గత ఏడాది క్యాన్సర్ కి గురికావడంతో అమెరికాలో చికిత్స పొంది, వచ్చిన ఈయన కు ఇక ప్రమాదం లేదని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాలీవుడ్ ని కుదిపేసింది. అందరినీ విషాదంలో ముంచేసింది. ‘రిషి కపూర్ ఇక లేరు. ఇప్పుడు వెళ్లిపోయారు. నా మనసు చలించిపోయింది’అంటూ బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేయడంతో అందరికీ రిషి మరణవార్త తెల్సింది. రిషికి భార్య నీతూ కపూర్,కుమారుడు రణబీర్ కపూర్ కూతుళ్లు రిదినా కపూర్ ఉన్నారు.

రిషి 1952సెప్టెంబర్ 4న ముంబయిలో జన్మించాడు. బాలీవుడ్ దిగ్గజం రాజకపూర్ రెండవ కుమారుడు. 1955లో ఓ సాంగ్ లో బాల నటుడిగా మెరిశాడు. 1970లో రాజ్ కపూర్ నటించిన మేరా నామ్ జోకర్ మూవీలో నటించ అవార్డు అందుకున్నాడు. తర్వాత బాబీ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రికార్డ్ కలెక్షన్స్ సాధించి,సంచలన విజయాన్ని నమోదుచేసుకుంది. 51మూవీస్ లో హీరోగా, 41మల్టీస్టారర్ మూవీస్ లో చేసాడు. బాబీ,లైలా మజ్ను,సర్గం,దివానా వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

పలు అవార్డులు గెలుచుకున్న రిషి బాలీవుడ్ లవర్ బాయ్ గా 12చిత్రాల్లో నటించి రొమాన్స్ పండించాడు. రాజా, అమర్ అక్బర్ ఆంటోని,కచ్, కూలీ,నగీనా, దూస్రా ఆగ్ని , హనీమూన్,వంటి మూవీస్ తో రిషి తిరుగులేని సూపర్ స్టార్ అయ్యాడు. రాజేష్ ఖన్నా, అక్షయ్, ఐశ్వర్య రాయ్ తదితరులతో 1999లో తీసిన ఆ అబ్ లవ్ మూవీని ఈయనే డైరెక్ట్ చేసాడు. డైరెక్టర్ గా నిరూపించుకున్న ఈయన హీరో రోల్ నుంచి తప్పుకుని సహాయ నటుడిగా తన సత్తా చాటాడు. చివరిగా ది బాడీ మూవీలో నటించారు. ఈయన మరణం బాలీవుడ్ నే కాదు టాలీవుడ్,కోలీవుడ్ ఇలా భారతదేశంలో అన్ని భాషా చిత్రాల పరిశ్రమలను దుఃఖంలో ముంచేసాయి.