పవన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అలనాటి నటుడు సుధాకర్
సీనియర్ కమెడియన్ సుధాకర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను, చిరంజీవి మంచి స్నేహితులమని చిరంజీవితో కలిసి చాలా సినిమాలలో నటించానని సుధాకర్ చెప్పాడు. అయితే మెగా ఫ్యామిలీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నాడు.
అయితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కూడా తనకు మంచి స్నేహం ఉండేదని, చెన్నై వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే పవన్ సినిమాలో తానూ నటించానని అయితే ఆ సినిమాలో ఓ సీన్‌లో పవన్ తనని ఒరేయ్ అని పిలవాల్సి వచ్చిందని అలా నన్ను ఒరేయ్ అని పిలవడానికి పవన్ చాలా ఇబ్బంది పడ్డాడని అంతకు ముందు గోకులంలో సీత సినిమా షూటింగ్‌లో కూడా ఇలాంటి సంఘటననే ఎదురయ్యిందని అప్పుడు నువ్వు పిలిచేది నన్ను కాదు నా పాత్రను అని పవన్‌కి చెబుతుండేవాడినని గుర్తుచేసుకున్నాడు.