Movies

లాక్ డౌన్ సమయంలో పవన్‌ ఏం చేస్తున్నాడో తెలుసా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికులు తప్ప మిగిలిన వారు అంతా పనులకు దూరం అయ్యారు. సామాన్యులే కాదు,రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్‌ అంతా ఈ సమయంలో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక సినిమా పరిశ్రమలో గత రెండు నెలలుగా కార్మికులు పని లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే వలస కార్మికులు వివిధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నాడు. జనసైనికులతో అప్పుడప్పుడు వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల గురించి చర్చిస్తున్నాడు.

లాక్‌ డౌన్‌కు ముందు బిజీ బిజీగా వకీల్‌ సాబ్‌ చిత్రంలో నటించిన పవన్ చివరి దశకు చేరింది. ఆ సినిమా మరో రెండు వారాల పాటు షూటింగ్‌లో పాల్గొంటే పూర్తయ్యేది. కానీ లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్ తో షూటింగ్‌ వాయిదా పడింది. షూటింగ్‌ పూర్తయినంత వరకు డబ్బింగ్‌ కూడా పూర్తి చేశాడు. షూటింగ్‌ బ్యాలన్స్‌ వర్క్‌ లాక్‌ డౌన్‌ తర్వాత చేయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్‌ తన 27వ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ క్రిష్‌ తో కలిసి చేస్తున్నాడట. ఇదే సమయంలో మరికొందరు కొత్త దర్శకులతో కథ చర్చలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్‌ జరగడం కష్టం.కనుక కొత్త ప్రాజెక్ట్‌లు ఇప్పుడు ప్రారంభం కావు.అయినా కూడా కొన్ని కథలను వింటున్నట్లు టాక్. పవన్‌ కోసం ఇటీవల పలువురు దర్శకులు కొత్త కాన్సెప్ట్‌లతో కథలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.ఆ కథలు వినడంతో పాటు ఈ సమయంను తన ఫామ్‌ హౌస్‌లో కుటుంబ సభ్యులతో టైం పాస్‌ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కీలక అంశాలపై స్పందిస్తూ ఎపి ప్రభుత్వ తీరుని కూడా విమర్శిస్తున్నారు. కొన్ని సూచనలు చేస్తున్నారు.