Movies

విజయ్ దేవరకొండ ఫెవరెట్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్‌ సెన్సెషన్‌ల స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా ఎవరిని స్పూర్తిగా తీసుకుంటారని ప్రశ్నించగా.. రణ్‌బీర్‌ కపూర్‌ అని సమాధానమిచ్చారు. తను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్‌ ముందు వరుసలో ఉంటాడని, అతన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెబ్బుకొచ్చారు

ఇటీవల చూసిన కొన్ని షోలు, డాక్కుమెంటరీ సినిమాల గురించి విజయ్ అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘నేను తాజాగా ‘ఫౌధా’, ‘చీర్’‌ అనే డాక్యుమెంటరీలను చూశాను. ప్రతి ఒక్కరూ దీనిని చూడాలని కోరుతున్నాను. వీటితోపాటు మైఖేల్‌ జోర్డాన్‌, చికాగో బుల్స్‌కు సంబంధించిన ‘లాస్ట్‌ డాన్స్’‌ అనే డాక్యుమెంట్‌ సిరీస్‌ను చూశాను. ఈ సిరీస్‌ మీకు ఆశను, ప్రేరణను ఇస్తుంది. జీవితంలో ఆశయం కలిగిన వ్యక్తులను నేను ఇష్టపడతాను. వీళ్లు ఆ పని చేశారు.’ అని పేర్కొన్నారు. వీటిని చూడటం వల్ల నిరాశ నుంచి కోలుకోవడానికి, ప్రేరణ పొందడానికి ఉపయోగపడుతుందని ఆయన‌ అన్నారు. (కొత్త వినతులకు బ్రేక్‌ : విజయ్‌ ఫౌండేషన్‌)

ఒకవేళ నటుడు కాకపోతే ఆర్కిటెక్ట్‌ అయ్యేవాడినని విజయ్‌ అన్నారు. అర్కిటెక్స్‌ అంటే ఇష్టమని, ప్రయాణాలు చేసే సమయాల్లో అర్కిటెక్చర్‌పై ఆకర్షితుడైతానని తెలిపారు. ప్రపంచ అర్కిటెక్చర్‌పై వీడియోలను చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని. ఆర్కిటెక్చర్ కోసం జపాన్‌ను సందర్శించాలనుకుంటున్నానని తన మనుసులో మాటను బయట పెట్టారు.