Movies

ఎన్టీఆర్ హిట్ కన్నా మహేష్ ప్లాప్ కే ఎక్కువ రేటింగ్ వచ్చిందా?

మన టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు. వీరి సినిమాలకు కూడా పోటాపోటీగా భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరితోనూ దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు తీశారు.

మహేష్ తో “దూకుడు” లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత “ఆగడు” లాంటి డిజాస్టర్ ను కూడా ఇచ్చారు. అలాగే దీని కంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “బాద్షా” తీసి హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు ఈ హిట్టైన బాద్షా కంటే ప్లాప్ అయిన ఆగడు సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మన తెలుగు ఛానెల్స్ తమ వద్ద ఉన్న సినెమాలను మళ్ళీ టెలికాస్ట్ చేస్తుండగా పాత సినిమాలు సైతం అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ ను రాబడుతున్నాయి. అలా ఈ రెండు సినిమాలను టెలికాస్ట్ చెయ్యగా బాద్షా సినిమాకు 4.20 టీఆర్పీ పాయింట్స్ రాగా ఆగడు సినిమాకు 4.34 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి ఎన్టీఆర్ హిట్ సినిమా కన్నా మహేష్ ప్లాప్ కే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పాలి.