Movies

రాజమౌళి సినిమాలోని వైవిద్యం ఇదే…ఆ స్పెషాలిటీ వేరు…చుస్తే ఆశ్చర్యపోతారు

ఎస్ ఎస్ రాజమౌళి అనగానే ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని దర్శక ధీరుడు గుర్తొస్తాడు. టాలీవుడ్ లో స్టూడెంట్ నెంబర్1 నుండి ఛత్రపతి – యమదొంగ – మగధీర – మర్యాద రామన్న – ఈగ.. ఇలా తను తెరకెక్కించే ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. ఇక భారీ తారాగణంతో రూపొందిన బాహుబలి సినిమా తెలుగు – తమిళ – మలయాళ – హిందీ భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. ప్రతీ సినిమాలో ఒక్కో వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. సీరియల్ దర్శకుడిగా ఉన్న రాజమౌళిని సినిమా డైరెక్టర్ గా స్టూడెంట్ నెం1 మార్చింది. గురువు దర్శకేంద్రుడి పర్యవేక్షణలో దర్శకుడిగా మారిన రాజమౌళి మొదటి సినిమాతోనే అటు ఎన్టీఆర్ కి లైఫ్ ఇచ్చి.. దర్శకుడిగా ఆయన కూడా నిలదొక్కుకున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

ఎన్టీఆర్-రాజమౌళిలు తదుపరి మూవీ సింహాద్రి. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హిట్ పెయిర్.. రెండో సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.తెలుగు చిత్రసీమకు మొదటిసారి రగ్బీ ఆటను పరిచయం చేసిన సై- సినిమా కాలేజీ లైఫ్ – యవ్వనం – లవ్ – గోల్ నేపథ్యంలో సాగింది. ఈ సినిమా స్పోర్ట్స్ సినిమాలు తీయాలనే వారికి ధైర్యం ఇచ్చిందని చెప్పాలి. మొదటిసారి ప్రభాస్ రాజమౌళిలను కలిపిన సినిమా ఛత్రపతి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా ప్రభాస్ ని స్టార్ హీరోని చేయడమే గాక అప్పటి నుండి కెరీర్ హై రేంజ్ కి చేరింది. పోలీసు స్టోరీ కథాంశంగా రాజమౌళి రూపొందించిన ఏకైక చిత్రం విక్రమార్కుడు. రవితేజ ద్విపాత్రాభినయంలో థియేటర్లను ఓ ఊపు ఊపేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. “విక్రమ్ సింగ్ రాథోడ్” పోలీస్ పాత్ర చరిత్రలో చిరస్మరణీయం.

రాజమౌళి తీసిన ఏకైక సోషియో ఫాంటసీ సినిమా యమదొంగ-. ఈ సినిమాలో ఎన్టీఆర్.. యాక్టింగ్ కి యంగ్ టైగర్ గా బిరుదు వచ్చింది. ఎన్టీఆర్-రాజమౌళి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. – దేశం మొత్తాన్ని టాలీవుడ్ వైపు తిప్పిన మగధీర రామ్ చరణ్ కి రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్ తో రూపొంది రికార్డులు బద్దలు కొట్టింది. టాలీవుడ్ కి ఓ ల్యాండ్ మార్క్ గా నిల్చి, టాలీవుడ్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. కమెడియన్ సునీల్ కి స్టార్ డమ్ తెచ్చిన మర్యాద రామన్న సూపర్ హిట్. “మగధీర” ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ ని హీరోగా ఎంచుకోవడమే వైవిధ్యమైన అంశం. ఇతర భాషలలోకి అనువాదమై హిట్ సాధించి, రాజమౌళిని మరో మెట్టు ఎక్కించింది. ఈగ- ఇండియన్ సినీ చరిత్రలో హీరో లేకుండా ఒక కీటకంతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం మాములు విషయం కాదు. ఓ ఈగలోకి మనిషి ఆత్మ దూరి శత్రువుని మట్టుపెట్టడం కాన్సెప్ట్ తో ఊహించని విధంగా రాజమౌళి షాక్ ఇచ్చాడు. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించి ఇండియన్ సినిమాను మరో రేంజ్ కితీసుకెళ్లింది.

అసలు జానపద నేపథ్యంలో ఓ ఊహాత్మక చరిత్రను బాహుబలి-ది బిగినింగ్- పేరుతొ తెరమీదకి తీసుకురావడమే గ్రేట్. బాహుబలి అనేది తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాతో సినిమాలోని నటులంతా ఎనలేని స్టార్ డమ్ పొందారు. తెలుగు – తమిళ మలయాళ తమిళ భాషల్లో విడుదలై అందరినీ అబ్బురపరిచింది. ఇక సీక్వెల్ గా బాహుబలి-ది కంక్లూజన్ మూవీ అభిమానుల అంచనాలను రాజమౌళి విజన్ ఈజీగా రీచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల కోట్లు కొల్లగొట్టింది. ఇక 1000 కోట్లు కొల్లగొట్టిన మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర తిరగరాసింది. ఈ సినిమాతో రాజమౌళి ఎందరికో గురువు అయ్యాడు. డార్లింగ్ ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ డమ్ అందించిన సినిమా ఇదే. ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ – రాంచరణ్ లు పాన్ ఇండియా స్టార్లు స్వాతంత్ర్య యోధులు అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ ల జీవితాల ఆధారంగా రూపొదిందించడమే ప్రత్యేకత. ప్రస్తుతం లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిన ఈ మూవీ అన్నీ కుదిరితే, 2021లో రిలీజ్ కానుంది.