Movies

తల్లి,తండ్రి విడిపోవటంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి హాసన్

అన్నీ మన మంచికే అంటారు కదా .. ఇప్పుడు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ చెప్పేది అలానే ఉంది. చాలా పాశ్చాత్య పోకడలు కలిగి ఉన్న అమ్మాయిగా అనిపించే ఈ భామ .. స్వతంత్ర భావాలు కలిగి ఉండటంతో పాటు ఒకరిపై ఆధారపడని తత్వం. తండ్రి పేరుతో ఆమె కెరీర్ మొదలు పెట్టినా కూడా ఆమె సొంతంగానే కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి శృతిహాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘నా తల్లిదండ్రులు కలిసి ఉన్న సమయంలో ఎదుర్కొన్న సమస్యలను నేను ప్రత్యక్షంగా చూశాను. ఇద్దరు కూడా ఆర్టిస్టులే అవ్వడంతో ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో విభేదించుకునే వారు. ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అవుతున్న సమయంలో విడిపోయారు. వారిని కలిపేందుకు ప్రయత్నించాలనుకున్నాను. కాని వారు కలిసినా కూడా గొడవ పడుతారని.. ఇద్దరి జీవితాల్లో మనశ్శాంతి కోల్పోతారనే ఉద్దేశ్యంతో తాను ఆ ప్రయత్నం చేయలేదు’అని శృతి చెప్పుకొచ్చింది.

‘నా ఉద్దేశ్యం ప్రకారం అమ్మా నాన్న విడిపోయి, విడి విడిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. ఆ సమయంలో వారు విడిపోవడం మంచిదే. ఒకవేళ వారు విడిపోయి ఉండక పోతే ఇద్దరు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. అమ్మానాన్న విడిపోవడం నాకు ఇబ్బందిని కలిగించినా కూడా నా ఆనందం కోసం వారిని కలిసి ఉండాలని కోరుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదనిపించింది. అమ్మా నాన్నలతో నేను, చెల్లి సంతోషం గా ఉన్నాం. వారిద్దరు కూడా ఎవరికి వారు జీవిస్తూ సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు’అని శృతిహాసన్ వివరించింది.