మాతృమూర్తి మాధుర్యాన్ని తెలిపే అందమైన కోట్స్ – 2
* అమ్మ.. నాకు మాటలు నేర్పమంటే తను కూడా నాలానే మాట్లాడుతుంది. అమ్మ.. నేను పలికే కొత్త కొత్త మాటలకి అర్థాలు చెప్పే నిఘంటువు. అమ్మ.. చందమామ రాదు అని తెలిసినా.. చందమామ రావే.. అని నా కోసం పిలుస్తుంది. అమ్మ.. నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు. – మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
* ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ మాతృ – దినోత్సవ శుభాకాంక్షలు
* అమృతం లాంటి ప్రేమను చూపేది.. అప్యాయత అనురాగం పంచేది అమ్మ – ‘హ్యాపీ మదర్స్ డే’ అమ్మ
* ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే – హ్యాపీ మదర్స్ డే
* నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే.
* అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే.. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.
* సృష్టిలో అందమైనది పువ్వు.. నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు. – హ్యాపీ మదర్స్ డే