మాతృమూర్తి మాధుర్యాన్ని తెలిపే అందమైన కోట్స్ – 1
* ‘‘అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే అమ్మకి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు.
* ‘‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే’’. ఓ మాతృ మూర్తి.. ‘మదర్స్ డే’ సందర్భంగా మీ కిదే మా వందనం!!
* ‘‘కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు… పాదాభివందనం!! – హ్యపీ మదర్స్ డే
* అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. – హ్యాపీ మదర్స్ డే
* అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా.. – హ్యపీ మదర్స్ డే