Movies

లాక్ డౌన్ సమయంలో ఈ స్టార్ హీరో కూతురు ఏమి చేస్తుందో తెలుసా?

లాక్‌డౌన్ ‌లో సమయంలో షూటింగ్ లు బంద్ కావడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.వీరిలో చాలా మందిసోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉండగా, కొంత మంది మాత్రం తమకి ఇష్టమైన, నచ్చిన పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

కొంత మంది హీరోయిన్స్ సోషల్ సర్వీస్ లో భాగంఅ వుతున్నారు.ఇప్పుడు ఓ హీరోయిన్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై తమ పొలంలో నాట్లు వరినాట్లు వేసే పనిలో పడింది.ఈ వీడియోని ఆమె తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సౌత్ లో అందరికి భాగా పరిచయం అయిన పేరు అరుణ్ పాండ్యన్.ఫైట్ మాస్టర్ గా, నటుడుగా, దర్శకుడుగా అందరికి సుపరిచితమే.అతని కూతురు కీర్తి పాండ్యన్ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె తండ్రి బాటలోనే సొంత వ్యవసాయ పొలంలో నాట్లు వేస్తూ బిజీగా మారిపోయింది.మండుటెండలో కూడా ట్రాక్టర్ ఎక్కి పొలంలో పంటలు పండిస్తోంది.

మలయాళంలో హీరోయిన్ గా రాణిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తండ్రి అరుణ్‌తో కలిసి విలన్‌ అనే మలయాళ సినిమా తమిళ రీమేక్‌లో నటిస్తుంది.లాక్ డౌన్ కారణంగా కీర్తి తన స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటుంది.క్వారంటైన్ టైంని ఇలా తనకి ఇష్టమైన పనిలో కాలక్షేపం చేస్తున్న, ఈ పొలం అంతా మాదే అంటూ కీర్తి ట్విట్టర్ లో తన వీడియో పెట్టి పోస్ట్ చేసింది.