మంచి టీఆర్పీ రాబట్టిన ఈ ఎవర్ గ్రీన్ సినిమాలు!
ప్రస్తుత లాక్ డౌన్ లో అవి ఇవి అని లేకుండా అన్ని సినిమాలను మరోసారి ఒక రౌండ్ వేసేస్తున్నారు అన్ని భాషల టెలివిజన్ ఆడియెన్స్. అలా మన తెలుగులో కూడా కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలను మళ్ళీ టెలికాస్ట్ చేసినా మంచి ఆదరణను అందిస్తున్నారు. అలా గత వారం టెలికాస్ట్ చేసిన పలు సినిమాల్లో కొన్ని పాత సినిమాలు మంచి రేటింగ్ ను రాబట్టాయి.
వాటిలో ఆల్ టైం ఫ్యామిలి క్లాసిక్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమా ఒకటి అయితే మరొకటి ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా వచ్చి రికార్డుల కలకలం రేపిన “అరుంధతి” చిత్రం సిద్దార్థ్ మరియు త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు గత వారంలో టెలికాస్ట్ చెయ్యగా 4.56 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సోసియో ఫాంటసీ అనే పదాన్ని పరిచయం చేసిన లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ అనుష్కతో తీసిన అరుంధతి చిత్రానికి గాను 4.65 రేటింగ్ వచ్చింది. ఈ రెండు చిత్రాలు ఎప్పుడో విడుదలైనా ఇప్పుడు ఈ స్థాయి రేటింగ్ రావడం విశేషమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విడుదలైన కొత్త సినిమాలు కూడా ఈ రేటింగ్ ను రాబట్టలేదు.