అక్కినేని హీరో గా ఎంట్రీ ఇచ్చిన ‘శ్రీ సీతా రామ జననం’గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్ కి రెండు కళ్ళు అంటాం కదా అందులో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు .. ఈయన చేయని పాత్ర లేదు. ఆయన చనిపోయేనాటికి తెలుగు సినిమాకు 83 ఏళ్లు. అన్నేళ్ల సినీ ప్రస్థానంలో 78 ఏళ్లు ఏఎన్నార్ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అక్కినేని నాగశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో అందుకున్నారు. దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ను సైతం పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన నటుడు అక్కినేని ఒక్కరే.
అక్కినేని తర్వాత అమితాబ్ బచ్చన్ పద్మ పురస్కారాల్లో మూడు అందుకున్నారు. భారత దేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా అక్కేనేని నాగేశ్వరరావు అని చెప్పాలి. బాలరాజు ..బాలచంద్రుడు .. దేవదాసు..కాళిదాసు …కబీరు..అతడే…క్షేత్రయ్య….అర్జునుడు ..అభిమన్యుడు … చారిత్రక పురుషుడు… భక్తవరేణ్యుడు… జానపద కథా నాయకుడు… అమర ప్రేమికుడు.. ఇలా చెప్పుకుంటూ పొతే, తెలుగు చిత్ర పరిశ్రమలోఅక్కిని బహుదూరపు బాటసారి.
1941లో పి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధర్మపత్ని’ సినిమాతో నట ప్రస్థానాన్ని అక్కినేని నాగేశ్వర రావు ఆరంభించారు. ఈ చిత్రంలో ఆయన 17 ఏళ్ల యువకుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం ‘శ్రీ సీతారామ జననం’ సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా హీరో గా మారారు. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య తన స్వీయ దర్శత్వంలో నిర్మించారు. అక్కినేని హీరోగా శ్రీ సీతారామ జననం సినిమాతో నట జీవితాన్ని మొదలుపెట్టారు. అలా తన నట జీవితాన్ని శ్రీరాముడిగా ప్రారంభించిన నాగేశ్వరరావు ఆ తర్వాత ఏ సినిమాలో శ్రీరాముడు పాత్రలో కనిపించలేదు. కానీ ‘చెంచులక్ష్మి’ ‘రామదాసు’ చిత్రంలో శ్రీ మహావిష్ణుగా మాత్రం నటించారు. ఇక ‘చెంచు లక్ష్మి’లో నరసింహా స్వామి పాత్రలో నటించి మెప్పించారు.