Movies

దగ్గుబాటి రానా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త త్వరలో పెళ్ళికి సిద్దం కానున్నారు. లీడర్ చిత్రం తో వెండితెర కు పరిచయం అయిన దగ్గుబాటి రానా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక, మిగతా భాషల్లోనూ నటిస్తున్నారు. అయితే హీరోగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగా, విలన్ గా రానా ఆకట్టుకున్నారు. బాహుబలి చిత్రం తో యావత్ భారతావని గర్వించ దగ్గ సినిమా లో ప్రతి నాయకుడు పాత్ర పోషించారు.

అయితే తాజాగా రానా దగ్గుబాటి ప్రేమలో పడ్డారు.అయితే ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు.అయితే ప్రస్తుతం రానా ఫ్యాన్స్, ప్రేక్షకులు, నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరా అని తీవ్రంగా వెతుకుతున్నారు. అయితే తన పేరు మిహీకా బజాజ్. ఆ అమ్మాయి డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో ను రన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాను వెడ్డింగ్ ప్లానింగ్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఆ అమ్మాయి ఎలా పరిచయం, ఎన్ని రోజుల నుండి వీరు ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.