Movies

రానాకు కాబోయే భార్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు

రానా గురించి అనేక కథనాలు వచ్చినా, రానా దేనిపైనా స్పందించకపోవడంతో అవన్నీ వచ్చినంత త్వరగా అంతర్థానమయ్యాయి. అయితే ఈసారి రానానే స్వయంగా తన ప్రేయసిని పరిచయం చేయడంతో అటు టాలీవుడ్, ఇటు అభిమానులు ఆశ్చర్యపోయారు. రానా మనసు దోచిన ఆ అందాలభామ ఎవరంటూ విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

మిహీక స్వస్థలం హైదరాబాదే! అయితే ముంబయిలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తోంది. అంతేకాదు, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థ నడుపుతోంది. ఈ సంస్థ ప్రధానంగా సెలబ్రిటీ వివాహాల నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే అమితమైన మక్కువ చూపే మిహీక ముంబయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకుంది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేసింది.

మిహీకకు హార్స్‌ రైడింగ్‌ చేయడమంటే చాలా ఇష్టం. పుస్తకాలు కూడా చదువుతుంది. అప్పుడప్పుడూ బిజినెస్‌లో భాగంగా ఆమె తరచూ హైదరాబాద్‌, ముంబై నగరాల మధ్య ప్రయాణం చేయాల్సి వచ్చేది. హైదరాబాద్‌లో ఆమెకు చాలా మంది స్నేహితులున్నారు. అలాగే నగరంతో మంచి అనుబంధం ఉంది. మిహీక వెంకటేష్ పెద్ద కుమార్తె ఆష్రితా దగ్గుబాటితో కలిసి పొటోలకు పోజులు కూడా ఇచ్చింది

ఇక ఆమె ఇష్టాల విషయానికి వస్తే… ఫుడ్ అంటే అమితంగా ఇష్టపడుతుంది మిహీక. ఆమెకు తినడం అంటే ఎంతయిష్టమో వండడం కూడా అంతే ఇష్టం. వీటితోపాటుగా పుస్తకాలు చదవడం కూడా చాలా ఇష్టమట. ఖాళీ సమయాల్లో తన కలానికి పనిచెబుతూ రాస్తుందట కూడా!

ఇక మిహీక తల్లిదండ్రుల విషయానికొస్తే వారు హైదరాబాద్ లోనే క్రస్లా బ్రాండ్ పేరిట జ్యుయెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తండ్రి పేరు సురేశ్ బజాజ్, తల్లిపేరు బంటీ బజాజ్. మిహీక తల్లి బంటీ జ్యుయెలరీ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హైదరాబాద్ జేఎన్ టీయూలో విద్యాభ్యాసం చేశారు. మొదట్లో తల్లితో కలిసి వెడ్డింగ్ ప్లానర్ గా పనిచేసిన మిహీక ఆపై సొంతంగా ఈవెంట్లు చేపడుతూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

మిహీకకు సమర్థ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. క్రస్లా బ్రాండ్ కార్యకలాపాలన్నీ అతడే చూసుకుంటున్నాడు. సమర్థ్ వివాహం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషాతో జరిగింది.