టాలీవుడ్ లో త్రిష ఫెవరెట్ హీరో ఎవరో తెలుసా ?
దాదాపు పదేళ్లు త్రిషా తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సీనియర్ స్టార్ హీరోలైన చిరు, వెంకటేష్, నాగ్, బాలయ్యలతో పాటు, ఈ తరం స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో కూడా నటించింది. ప్రస్తుతం త్రిషాకు తెలుగులో అవకాశాలు లేవు. ఐతే తమిళంలో మాత్రం వరుస బెట్టి చిత్రాలు చేస్తుంది. చిరుతో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో అవకాశం వచ్చినా క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంది.
మరి ఇన్నేళ్లు తెలుగు పరిశ్రమలో ఉన్న త్రిషా ఫేవరేట్ హీరోల లిస్ట్ లో ఒక్క తెలుగు హీరో కూడా లేకపోవడం విశేషం. త్రిషకు ఆల్ టైం ఫేవరేట్ హీరోల లిస్ట్ లో ముగ్గురు హీరోలు ఉన్నారు. వారు లోకనాయకుడు కమల్ హాసన్, మోహన్ లాల్ చివరిగా అమీర్ ఖాన్. కోలీవుడ్ నుండి కమల్ , మాలీవుడ్ నుండి మోహన్ లాల్ , బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ ని ఎంచుకున్న త్రిష టాలీవుడ్ ని మరచిపోవడం గమనార్హం.