ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా…?
తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి “యమదొంగ” చిత్రంలోని “నువ్వు ముట్టుకుంటే” అనే పాటలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ సరసన ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది.కానీ తెలుగులో అవకాశాలు మాత్రం తెచ్చుకోలేక పోయింది.
దీంతో ఈ అమ్మడు తన మకాం ని మలయాళ చిత్ర పరిశ్రమకు మార్చింది.అయితే అక్కడ మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.అయితే మమతా మోహన్ దాస్ ఒకపక్క చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క తన గొంతుతో శృతి కూడా వినిపిస్తోంది.తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో “ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా” అనే పాట ఈ ముద్దు గుమ్మ పాడినదే.
అయితే కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయి సంవత్సర కాలం కూడా గడవక ముందే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, విబేధాలు, గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
దీంతో ప్రస్తుతం మమతా మోహన్ దాస్ ఒంటరిగా ఉంటోంది. ఈ కారణంగా కొంత కాలం మమతా మోహన్ దాస్ మానసికంగా కృంగిపోయింది.
అయితే ఆ తర్వాత యధావిధిగా తన సినీ జీవితంపై దృష్టి సారించింది.అయితే గతంలో ఈ అమ్మడు దాదాపు మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడింది.ప్రస్తుతం క్యాన్సర్ బారినుండి పూర్తిగా కొలుకోడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.తమిళంలో 2 సినిమాలు, మలయాళంలో 3 సినిమాలలో నటిస్తోంది.