ఈ బాలీవుడ్ హీరోయిన్ చాలా డిఫ్రెంట్… ఎందుకో చూస్తే షాక్ అవుతారు
బాలీవుడ్ లో సంజయ్ దత్ తో చేసిన భూమి సినిమా తో అద్భుతమైన పేరు కొట్టేసిన భామ అదితి రావు హైదరి. ఈ అమ్మడు ఇక తెలుగులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మంచి పర్ఫార్మర్…బ్యూటి ఫుల్ యాక్ట్రెస్..ఫెంటాస్టిక్ హీరోయిన్ ఇలా ఎన్నో ఈమె గురించి వినిపిస్తాయి. అంతకముందు కూడా ఫితూర్, మర్డర్, వాజిర్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే ఏ సినిమా అయినా సరే, నటనకి ఆస్కారం ఉన్న పాత్రలే ఒప్పుకోవడం ఈమెలో గొప్పతనం అని చెప్పాలి.
మొదటి సినిమాతోనే తెలుగులో కూడా చక్కని అభినయంతో గుర్తింపు సొంతం చేసుకున్న,ఈ అమ్మడు మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి రూపొందుతున్న ‘వి’ సినిమాలో నటిస్తోంది. నాని, నివేదా థామస్, సుధీర్ బాబు నటిస్తున్నారు. అయితే హీరోయిన్స్ అందరి కంటే విభిన్నంగా ఆలోచిస్తున్న అదితి రావు హైదరి ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. అయితే ఈ సినిమాలో అదితి రావు హైదరి నానికి జోడిగా నటిస్తోందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.
ఇక అదితి రావు హైదరి టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ వే కావడం యాదృచ్ఛికం . ఈ సినిమాని హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న వి సినిమాని జూలై లో రిలీజ్ చేసే వకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ చేస్తారన్న మాట వినిపిస్తున్నా, వివరాలు అధికారికంగా అందాల్సి ఉంది.