Sports

హీరో హీరోయిన్స్ ని కోహ్లీ యే డిసైడ్ చేసేసాడు…ఆ కథ ఏమిటో తెలుసా ?

ఇండియాలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో క్రికెట్ కి కూడా అంతకు మించిన క్రేజ్ ఉంది. క్రికెటర్స్ కి బాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా సంబంధాలు, పెళ్లిళ్లు సరేసరి. ఇక దేశంలోని జనాలకు క్రికెట్ ప్రాణం కావడంతో క్రికెట్ లేని భారత్ ను అస్సలు ఊహించడం కష్టమని చెప్పాలి. ఐపీఎల్ అయినా.. ఇండియన్ క్రికెట్ అయినా, వరల్డ్ కప్ అయినా సరే పిచ్చిగా చూస్తారు. క్రికెట్ వస్తోందంటే,ఆఫీసుల్లో జనాలు కూడా క్రికెట్ స్కోర్ మీదే దృష్టి పెట్టేస్తుంటారు. ఇక ప్రపంచ క్రికెట్ లో భారత్ నుంచి చూస్తే రెండు అద్భుత ఘట్టాలు గతంలోనే ఆవిష్కారం అయ్యాయి. అందులో కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 లో ప్రపంచకప్ గెలవడం ఒకటైతే, ఆ తర్వాత ఎంఎస్ ధోని నేతృత్వంలో 2011లో ఇదే ప్రపంచకప్ ను సాధించడం రెండవది.

ప్రపంచ క్రికెట్ లోనే ఈ రెండు విజయాలు మరుపురాని ఘట్టాలు గా అభివర్ణించవచ్చు. కపిల్, ధోని కష్టపడి పైకి వచ్చారు. ఇద్దరూ లెజెండ్సే.. అందుకే వారిద్దరి బయోపిక్స్ రెడీ అయ్యాయి. ధోని బయోపిక్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తాజాగా కపిల్ దేవ్ పాత్రపోషిస్తూ నాటి 1983 ప్రపంచకప్ గెలిచిన కపిల్ సారథ్యంలోని టీంపై బయోపిక్ తీస్తున్నారు. అదే‘83’ సినిమాకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా దేశంలో లాక్ డౌన్ లేకుంటే ఎప్పుడో విడుదలయ్యేది. ధోని బయోపిక్ దేశంలో బంపర్ హిట్ అయ్యింది. వందల కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ధోని జీవితంలో ప్రేమ, విషాదం కష్టాలు, కడగండ్లు ఉండడం సినిమాకు బాగా కల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సచిన్’ బయోపిక్ డాక్యుమెంటరీగా మారిపోయి,జనానికి నచ్చలేదు. అందుకే ఫ్లాప్ అయ్యింది. అజహర్ బయోపిక్ కూడా అలానే దెబ్బతింది. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై ట్విట్టర్ లో కోహ్లీ లైవ్ చాట్ లో ఆసక్తికరంగా స్పందించాడు. తన బయోపిక్ తీస్తే తనే హీరోగా ఉంటానని.. అయితే హీరోయిన్ గా తన భార్య అనుష్క శర్మ అయితే ఓకే చెబుతానని షరతు పెట్టాడు. దీంతో కోహ్లీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి బాలీవుడ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా.. కోహ్లీనే స్వయంగా నటిస్తే సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా .అసలు తీయడానికి ఎవరు ముందుకొస్తారు వంటి ప్రశ్నలు వస్తున్నాయి.