ఈ భామలు కోట్లను వద్దని అనుకుంటున్నారు…కారణం ఏమిటో తెలుసా ?
ఈమద్య కాలంలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అయ్యారు.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కేవలం పాటలకు మరియు కొన్ని రొమాంటిక్ సీన్స్‌కు, కొన్ని ఎక్స్ పోజింగ్ సీన్స్‌కు తప్ప ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో కొందరు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని మడి కట్టుకుని కూర్చోవడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.
సౌత్ హీరోయిన్స్ కీర్తి సురేష్ మరియు సాయి పల్లవిలు ప్రస్తుతం కో అంటే కోట్ల రూపాయల పారితోషికాలు ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ లైన్‌లో ఉన్నారు.వీరిద్దరు ప్రస్తుతం తెలుగు తమిళ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్.కాని వీరిద్దరు మాత్రం హాట్ అందాల ప్రదర్శణకు నో చెబుతున్నారు.ఆ కారణంగా వీరికి ఎక్కువ సినిమా ఆఫర్లు రావడం లేదు.వచ్చినా కూడా స్కిన్ షోకు నో చెబుతున్న కారణంగా వెళ్లి పోతున్నాయి.
తమిళ నాట కీర్తి సురేష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుగులో కూడా అదే విధంగా ఉంది.ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరు కూడా స్కిన్ షోకు ఒప్పుకుంటే వెంటనే అరడజను సినిమాలు ఇద్దరి చేతిలో ఉంటాయి.రెండు కోట్ల పారితోషికం కూడా చేతిలో పెట్టే అవకాశం ఉంది.అంతటి క్రేజ్ ఉన్న వీరిద్దరు ఎందుకు కోట్లు మాకు అంటూ కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్నారు.వీరిద్దరు భవిష్యత్తులో అయినా అందాల ప్రదర్శణకు ఒప్పుకుంటారో చూడాలి.