Movies

రానాకు మిహికను పరిచయం చేసింది ఎవరో తెలుసా…?

దగ్గుబాటి వారసుడు, భళ్లాల దేవుడు రానా దగ్గబాటి ఇటీవల మిహిక బజాజ్ తాను ప్రేమలో ఉన్నామని చెబుతూ వారిద్దరికీ సంబందించి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.దీనితో ప్రస్తుతం ఇదే విషయంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెద్దల అంగీకారం తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.దీనికి సంబంధించి ఇటీవల వీరి రోకా వేడుక కూడా వైభవంగా జరిగింది.

త్వరలోనే ఈ ప్రేమ జంట నిశ్చితార్ధం,అలానే పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తుంది.అయితే గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా కు,ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్న మిహిక లకు మధ్య ప్రేమ ఎలా పుట్టింది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది.
అయితే వీరి ప్రేమ వ్యవహారానికి అసలు కర్త,కర్మ,క్రియ మొత్తం కూడా రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రీతయేనట.అసలు విషయం ఏమిటంటే వెంకటేష్ కుమార్తె అశ్రీత,మిహిక ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడం అలా రానాకు ఆశ్రీత ద్వారా మిహిక తో పరిచయం అది కాస్త ప్రేమ,పెళ్లి వరకు దారి తీసినట్లు సమాచారం.

అంటే వీరిద్దరి ప్రేమ,పెళ్లి వెనుక వెంకీ కూతురు ఉందని తెలుస్తుంది.సైలెంట్ గా ప్రేమ వ్యవహారం నడిపిన రానా ఇటీవల ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం తో ప్రస్తుతం ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి లో భళ్లాల దేవుడిగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న రానా త్వరలో పెళ్లి చేసుకోబోతుండడం తో చాలా మంది యువతుల మనసులు బాధతో నిండిపోయాయి.మరోపక్క ప్రస్తుతం రానావిరాట పర్వం అనే పొలిటికల్ థ్రిల్లర్‌తో పాటు అరణ్య అనే ఓ సోషల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు.కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా అరణ్య డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానున్నట్లు తెలుస్తుండగా, మరో సినిమా విరాట పర్వం మాత్రం సగానికిపైగా షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో రానాతో పాటు టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుండడం విశేషం.