చిన్నప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?
తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినటువంటి స్వర్గీయ హీరోయిన్ సౌందర్య గురించి తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం ఆమె భౌతికంగా ప్రేక్షకుల మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె నటించినటువంటి చిత్రాలు మాత్రం ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ చిత్రాలు గా ఉంటాయి.అంతగా సౌందర్య తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది.
అయితే సినీ జీవితంలో మంచి విజయాన్ని సాధించినటువంటి సౌందర్య చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో అనుకోకుండా ఓ ప్రమాదంలో మృతి చెందడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన అనతికాలంలోనే తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించినటువంటి సౌందర్య మరణాన్ని కొంతకాలం పాటు తన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఏదేమైనప్పటికీ 90 సంవత్సర కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం సౌందర్య తిరుగులేని హీరోయిన్ గా కొనసాగిందను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే సౌందర్య ఒక నటిగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాత మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.అయితే సౌందర్య మరణాంతరం ఆమె కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తడంతో దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆమె కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరిగారు.ప్రస్తుతం ఆమె భర్త బిఎస్ రఘు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.