ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి
చిన్నప్పటి ఫోటోలు భలే ముద్దుస్తాయి. ఆ జ్ఞాపకాలే వేరు.. ఖాళీగా ఉన్నపుడు పాతఫోటోలు తిరగేస్తుంటే ఆనాటి అనుభూతుల్లోకి వెళ్లిపోతుంటాం. సామాన్యులైన,సెలబ్రిటీలైనా ఈ విషయంలో ఒకేలా స్పందన ఉంటుంది. ఇక కరోనా మహామ్మారి కోరలు చాస్తున్న వేళ.. ఈ వైరస్ కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగతున్న సంగతి తెల్సిందే. అత్యవసర సేవలు మినహా మిగతా జన జీవనం మొత్తం స్థంభించిపోయింది. ఎపుడు షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమాలు, సీరియల్స్ అన్ని బంద్ అయ్యాయి.
దీంతో సామాన్యులతో పాటు హీరోలు, హీరోయిన్స్ అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. కొందరు హీరోలు, హీరోయిన్స్ తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో సోషల్ మీడియాలో ఫాన్స్ తో షేరు చేసుకుంటున్నారు. అంతేకాదు తమకు సంబంధించిన చిన్నప్పటి త్రో బ్యాక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్ అయింది. అదెవరంటే బాలీవుడ్ నటి యామీ గౌతమ్. ఈమె తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో ఫేమస్ అయిన యామీ గౌతమ్.. చిన్నపుడు ఎర్రటి కుందేలు డ్రెస్‌లో ఎంతో క్యూట్‌గా ఉంది. యామీ గౌతమ్ పెద్దయ్యాక కన్నడ మూవీ ‘ఉల్లాస ఉత్సాహా’ మూవీతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి సినిమాల్లో యామీ గౌతమ్ మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్లో ‘యాక్షన్ జాక్సన్’, ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘సర్కార్3’ ‘యూరీ’ వంటి సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో పలు చిత్రాలతో పాటు పలు ఫ్యాషన్ షోస్‌లో సత్తా చాటుతోంది.