కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఎవరిదో తెలుసా?
కరోనా వైరస్.గత ఐదు నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్. అలాంటి ఈ వైరస్ ని నియంత్రించేందు గత రెండు నెలలుగా భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఇంకా మన భారత్ లోకి కరోనా వైరస్ అడుగు పెట్టిన సమయం నుండి కూడా ఎంతోమంది జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూనే ఉన్నారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులూ, పిల్లలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇలా అన్ని విధాలుగా ప్రజలకు కరొనా వైరస్ పై అవగాహనా తెలుపుతూనే ఉన్నారు.
లాక్ డౌన్ నియమాలు పాటించి ఇంట్లోనే ఉండాలి అని చెప్తున్నారు.ఇంకా అందులో భాగంగానే సెల్ ఫోన్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన తెలపడం ప్రారంభించారు. దీంతో మన సెల్ నుండి ఎవరికి ఫోన్ చేసిన అప్పట్లో కాలర్ ట్యూన్ గా ఏదో ఒక అందమైన పాట వస్తే ఇప్పుడు కరోనా వైరస్ పై ఆవాహన పెరిగేలా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఫోన్ చేసిన కరోనా వైరస్ జాగ్రత్తల చర్యల కాలర్ ట్యూన్ ఏ వస్తుంది.
దీంతో తెలుగులో జాగ్రత్తలు చెబుతున్న ఈ గొంతు ఎవరిదా అని చాలా మంది అరా తియ్యడం ప్రారంభించారు. దీంతో ఈ గొంతు ఎవరిదో కాదు.మన ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిదే అని అందరికి అర్ధం అయ్యింది. మన ఆంధ్రలో విశాఖపట్నంకు చెందిన దుగ్గిరాల పద్మావతిది ఈ గొంతు.ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న ఈమె కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనా కల్పించే పలు రేడియో కార్యక్రమాలకు ఈమె వాయిస్ ఓవర్ ఇస్తుంటారు.