జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏమిటో తెలుసా?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే జూ.ఎన్టీఆర్ సినీ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తన మేనరిజం మరియు నటన, డైలాగ్ డెలివరీ వంటి వాటితో తన అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన వంటకానికి సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తాను నటించినటువంటి ఓ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు ఇష్టమైన వంటకం ఏంటని అడగగా అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెబుతూ తనకి ఇష్టమైన వంటకం కాల్చిన నాటుకోడి ఖీమా మరియు రోటీ అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఆ వంటకాన్ని ఎలా తయారు చేయాలో కూడా తెలిపాడు.ఇందులో నాటు కోడి ని బాగా కాల్చి అలాగే కీమా తయారు చేసి నాటి కోడిలో ఉంచి మళ్లీ రెండు గంటలపాటు కాల్చిన తర్వాత నెయ్యి పూసి ఒక పెద్ద రోటిలో నంజుకుని తింటే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక కొందరు అభిమానులు ఈసారి నాటుకోడిని మేము కూడా ఇలాగే ట్రై చేస్తాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.అదే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్ ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.