Movies

సమంత చేసిన పనివల్ల నాగ్ కి తలవంపులు

Samantha New movie Young Tiger NTR

సాధారణంగా పెళ్లయ్యాక కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడం ఇండస్ట్రీలో సహజం. కానీ పెళ్లి తరువాత కూడా బిజీ హీరోయిన్ గా అక్కినేని కోడలు సమంత మారిపోయింది.

అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత.

మళ్లీ అలాంటి పాత్రలు సై అంటోందట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే నయా మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరితోనూ సమంత అనేక సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో బృందావనం, జనతా గ్యారేజ్, రభస, రామయ్యా వస్తావయ్య సినిమాల్లో చేసింది.

ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో సమంత నటించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ సినిమాలో సమంత నటించబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా… ఈ మూవీలో సమంత నటిస్తే నాగార్జునకు తలవంపులు తప్పదనే టాక్ వినిపిస్తోంది.

దీనికి తోడు నాగార్జునకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మధ్య మన్మధుడు 2 సమయంలో విభేదాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో త్రివిక్రమ్ పేరుకూడా నాగార్జున ప్రస్తావించలేదు.

సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్‌ను మన్మధుడు 2 సినిమా విషయంలోనూ సాయం చేయాలని నాగ్ కోరాడని… అయినా త్రివిక్రమ్ నో చెప్పాడని మరో టాక్ నడిచింది.

అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ షికారు చేసాయి. అలా తన మామతో విభేదాలు ఉన్న త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత ఎలా నటిస్తుందని చెవులు కోరుకుంటున్నారు.

ఒకవేళ సమంత అలా చేస్తే అది కచ్చితంగా నాగార్జునకు అవమానమే తప్ప మరొకటి కాదన్నా మాట బలంగా వినిపిస్తోంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే అని కొందరు కొట్టి పారేస్తున్నారు. అయినా విబేధాలు ఇన్నాళ్లు ఉండవని అంటున్నారు.

Samantha New movie Young Tiger NTR