ఒకప్పటి ఈ ప్రభాస్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
prabhas eswar movie heroine sridevi vijay kumar
తెలుగులో ప్రముఖ దర్శకుడు జయంత్.సి పరాన్జీ దర్శకత్వం వహించినటువంటి Eswar అనే చిత్రంలో Prabhas సరసన హీరోయిన్ గా నటించి తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఒకప్పటి హీరోయిన్ Sridevi విజయ్ కుమార్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.
అయితే ఈమె మొదటగా తమిళ చిత్రాల ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే వరుస సినీ అవకాశాలతో బాగానే రాణిస్తున్నప్పుడు సినిమా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి రాహుల్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం శ్రీదేవికి రూపిక అనే ఒక పాప కూడా ఉంది.కాగా శ్రీదేవి తల్లిదండ్రులు విజయ్ కుమార్ మరియు మంజుల, అలాగే అక్కచెల్లెళ్ళు కూడా సినీరంగానికి చెందిన వారే కావడం విశేషం.
అయితే శ్రీదేవి సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ కూతురే అయినప్పటికీ అతని పేరు ఉపయోగించుకోకుండా శ్రీదేవి సొంత ప్రయత్నాలు చేస్తూ సినీ అవకాశాలు దక్కించుకుంది.
అలాగే వాటిని చక్కగా ఉపయోగించుకుంటూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో శ్రీదేవి చివరి సారి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించినటువంటి వీర అనే చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ చెల్లెలి పాత్రలో నటించింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.కాగా శ్రీదేవి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క పలు డాన్స్ మరియు ఇతర షోలకు జడ్జి గా కూడా వ్యవహరించింది.
అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఏమైందో ఏమోగానీ శ్రీదేవి చిత్రాల్లో నటించడం లేదు సరి కదా చిత్ర పరిశ్రమలోని కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు.