Movies

హీరోయిన్ నగ్మా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం హీరోనే…!

The reason why telugu veteran actress nagma is not married

టాలీవుడ్ తో పాటు కన్నడ,మలయాళ,తమిళ,హిందీ సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ నగ్మా 1990దశకంలో ఓ ఊపు ఊపేసింది.2009వరకూ హీరోయిన్ గా తన సత్తా చాటింది.

తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలయ్య,విక్టరీ వెంకటేష్,కింగ్ నాగార్జున, తదితరులతో జతకట్టి మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ పాత్రల తర్వాత అత్త పాత్రలతో పాటు ఆడియన్స్ ని అలరించిన ఈ ముద్దుగుమ్మ కు అప్పుడే 48ఏళ్ళు వచ్చేసాయి.

అయినా పెళ్లి ఊసేలేదు. అసలు ఈ అమ్మడు ఎందుకు పెళ్లి చేసుకులేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా చేరి ప్రజాసేవలో మునిగితేలుతున్న ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాల్లో అదరగొట్టింది.

ఇంతకీ నగ్మా కోలీవుడ్ కి చెందిన ఓ హీరోతో ప్రేమాయణం సాగించిందట.

చాలా గాఢంగా ప్రేమించినప్పటికీ సదరు హీరో మరో భామను పెళ్ళాడడంతో నగ్మా అప్పటి నుంచి పెళ్లి ఊసుకి దూరంగానే ఉంటోందట.
అన్నట్టు స్టార్ క్రికెటర్ గంగూలితో కూడా ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు అక్కడా విఫలం అవ్వడంతో ఇక పెళ్ళికి దూరంగానే ఉండిపోయిందట. అదీ సంగతి.