అల్లు శిరీష్ సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలుసా ?
Allu Sirish Unknown facts
సినిమా రంగంలో కాలుపెట్టాలని స్టార్ గా పేరుతెచ్చుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఏళ్లతరబడి పడిగాపులు కాస్తుంటారు. కానీ కొందరికి వారసత్వంగా సినిమాల్లో ఛాన్స్ లు వచ్చేస్తాయి. అయితే వారసత్వం అనేది సినిమా వరకే ఉంటుంది.
నటనలో టాలెంట్ ఉంటేనే ఫాన్స్ వస్తారు. ఆకట్టుకునేలా నటన లేకుంటే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేరు.
ఇప్పటికే టాలీవుడ్ లో ఇది చాలామంది విషయంలో ప్రూవ్ అయింది కొందరు స్టార్స్ గా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ఉంటే, మరికొందరు కనుమరుగైపోతున్నారు.
కాగా స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి బాటలో దాదాపు అరడజను మందికి పైనే హీరోలు ఇప్పటిదాకా ఎంట్రీ ఇచ్చారు.
ఇందులో తొలిమూవీతోనే క్రేజ్ తెచ్చుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇందులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ ఒకడు. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేసి,నాలుగు విజయాల్ని,రెండు ప్లాప్ లను తెచ్చుకున్నాడు. అవార్డ్స్ ఫంక్షన్స్ కి హోస్ట్ గా కూడా చేసి,మెప్పించాడు.
ఇక 1987మే30న చెన్నై లో జన్మించిన శిరీష్ డిగ్రీ అయ్యాక ,మాస్ కమ్యూనికేషన్ లో జర్నలిజం చేసాడు.
సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా, గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ గా పేరుతెచ్చుకుని, 2013లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కె రాధామోహన్ డైరెక్షన్ లో గౌరవం మూవీతో ఎంట్రీ ఇచ్చిన శిరీష్ అంతకుముందు తమిళ సీరియల్ లో బాలనటుడిగా నటించాడు. తొలిసినిమా హిట్ కాకున్నా మారుతి డైరెక్షన్ లో కొత్త జంట మూవీ చేసి విజయాన్ని అందుకున్నాడు.
అరవింద్ కొడుకు అల్లు అర్జున్ ఇప్పటికే స్టైలిష్ స్టార్ గా దూసుకెళ్తుంటే, అతని తమ్ముడు శిరీష్ కూడా తనదైన పంధాలో వెళ్తున్నాడు.
పరశురామ్ డైరెక్షన్ లో శ్రీరస్తు,శుభమస్తులో మరోవిజయాన్ని అందుకున్నాడు.
ఆతర్వాత ఒక్కక్షణం మూవీ చేసినా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. ఆతర్వాత ఎబిసిడి మూవీ కూడా ఆకట్టుకోలేదు.
ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కల్సి నటించాడు.