Movies

డైరెక్ట్ ఓటిటి లోకి వస్తున్న ఆ స్టార్ హీరోయిన్ సినిమా?

Another star heroine movie also coming directly to ott

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా మన ఇండియన్ సినిమాలో చాలా మార్పులే వచ్చాయి.

దీనితో చాలా సినిమాలు థియేటర్స్ లేక నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.

అలా ఇటీవలే తమిళ్ లో జ్యోతిక నటించిన “పొన్ మగళ్ వందల్” చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.

అలాగే ఇదే బాటలో కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” కూడా ఇదే జూన్ లో రానుంది.

అయితే ఇదే బాటలో మరో హీరోయిన్ సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. మన దేశంలోని అన్ని ముఖ్య ఇండస్ట్రీలలోను నటించి అలరించిన లక్ష్మి రాయ్ మెయిన్ లీడ్ లో నటించిన తాజా చిత్రం “సిండ్రెల్లా”.

ఈ చిత్రం అతి త్వరలోనే డైరెక్ట్ ఓటిటి లోకి రానున్నట్టు ఇప్పుడు సమాచారం.

హార్రర్ జాన్రాలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.