పుష్ప సినిమా షూటింగ్‌కి సుకుమార్ సరికొత్త స్ట్రాటజీ
Director sukumar follows new method for pushpa movie shooting
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో చాలా మంది పేద సినీ కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది.
అయితే రాష్ట్రంలో డౌన్ అమలులో ఉన్నపటికీ సడలింపులు ఇస్తున్న ప్రభుత్వం త్వరలోనే సినిమా షూటింగ్స్ మొదలు పెట్టడానికి అనుమతిచ్చింది.
ఈ నేపధ్యంలో దర్శకుడు సుకుమార్ పుష్ప మూవీ షూటింగ్ పై తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం.
‘ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్’ ద్వారా ఆగస్ట్ నెల నుండి పుష్ప షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట.
ఇందులో భాగంగా మొదటగా నెల రోజుల పాటు పరిమిత సంఖ్యలో యూనిట్ సభ్యులను అలో చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారట.
ఆ సమయంలో సభ్యులందరూ ఓ ప్రాంతంలోనే ఉండేలా చూస్తూ వాళ్ళెవరూ ఇతరులను కలవడం, అదే విధంగా ఇతరులు వీలున్న ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తారట.
ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటేనే తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట.
షూటింగ్‌కి హాజరయ్యే అందరిలోనూ ధైర్యం నింపేలా ‘ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్’ ఉపయోగించనున్నారట సుకుమార్.