ఈ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Isha Chawla Filmography | Where Is Isha Chawla?
డైరెక్టర్ కె విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ కావాలి మూవీ ద్వారా టాలీవుడ్ లో ఇషా చావ్లా ఎంట్రీ ఇచ్చింది. సాయికుమార్ ఆది హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో తెలుగులో వరుసగా ఛాన్స్ లు అందిపుచ్చుకున్న ఇషా చావ్లా ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన ఈ స్టార్ హీరోయిన్ గురించి చాలా ఆసక్తికర విషయాలున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఇషా చావ్లా ఫాన్స్ తో పలు అంశాలు పంచుకుంటుంది. సునీల్ హీరోగా వచ్చిన పూల రంగడు మూవీలో నటించిన ఇషా చావ్లా కు ఈ మూవీ కూడా మంచి పేరుతెచ్చింది.
ఆతర్వాత శ్రీమాన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు,జంప్ జిలాని,రంభ ఊర్వశి,మేనక సినిమాలు చేసినా ఇషా చావ్లా కెరీర్ కి అసలు దోహదం చేయలేకపోయాయి.
తెలుగు,కన్నడ భాషల్లో ఏడు సినిమాలు చేసిన ఇషా చావ్లా కేవలం రెండే హిట్స్ అందుకుంది.
కథల విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వలన దెబ్బతిని, సడన్ గా టాలీవుడ్ నుంచి దూరం అయింది.
ఎందుకు దూరం అయిందో తెలీదు కానీ, సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం వల్లే దూరంగా జరిగిందని టాక్ జోరుగా నడుస్తోంది.
దీనికి తోడు ఇద్దరు పిల్లలతో కల్సి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి వార్తలపై ఈ ముద్దుగుమ్మ అసలు స్పందించకపోవడం కొసమెరుపు.