Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

తెలుగులో ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించినటువంటి యువత అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కి జంటగా నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్న ముంబై హీరోయిన్ మరియు మోడల్ అక్ష గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో హీరోయిన్ గా మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది.

దీనికి తోడు కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంవల్ల ఈ అమ్మడు నటించిన చిత్రాల్లో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి.కాగా అక్ష తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో ఆసక్తి కనబరచడంతో తన తల్లిదండ్రులు మోడలింగ్ లో శిక్షణ ఇప్పించారు.

ఆ విధంగా అక్ష ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.అయితే మొదటిగా అక్ష 2004వ సంవత్సరంలో ముసాఫర్ అనే బాలీవుడ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ పరిశ్రమకు పరిచయం అయింది.అయితే తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి యువత, రైడ్, రయ్ రయ్ తదితర చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.అయితే అందం, అభినయం, నటనా ప్రతిభ ఉన్నటువంటి అక్ష తెలుగులో ఎందుకు హీరోయిన్ గా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.

ఈ అమ్మడు హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించింది.కానీ ఆ పాత్రలకు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో ఎవరు గుర్తించ లేదు.కాగా అక్ష తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా నటించింది.అయితే చివరి సారిగా అక్ష టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించినటువంటి రాధా అనే చిత్రంలో రుక్మిణి అనే యువతి పాత్రలో కనిపించింది.ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో ఈ అమ్మడు నటించలేదు.