Movies

సర్కారు వారి పాట సినిమా నిర్ణయ అధికారాలు అన్ని ఆమెవేనా…?

మహేష్‌బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట పరశురామ్‌ దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది.రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. మహేష్‌బాబు లుక్‌ చాలా విభిన్నంగా ఉండబోతుందని ఆ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది.

అయితే సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీ వ్యవహారాలు మరియు బిజినెస్‌ వ్యవహారాలు మొత్తం కూడా మహేష్‌బాబు భార్య నమ్రత చూసుకోబోతుందట.మైత్రి మూవీ, 14 రీల్స్‌ వారితో పాటు ఈ సినిమాకు మహేష్‌బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సినిమా షూటింగ్‌ ప్రారంభించే సమయం నుండి అన్ని విషయాలను కూడా నమ్రత పర్యవేక్షించబోతుందట.గతంలో శ్రీమంతుడు సినిమాకు కూడా ఆమె ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి ఆ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.మళ్లీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు కూడా నమ్రత ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది.

సర్కారు వారి పాటకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఒక టీంను నమ్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్మాతలకు మరియు దర్శకుడికి ప్రత్యేకంగా ఈమె చెప్పింది.తనకు తెలిసే ప్రతి విషయం జరగాలని ముందే సూచించిందట.మొత్తానికి సర్కారు వారి పాటతో సూపర్‌ హిట్‌ను భర్తకు అందించేందుకు నమ్రత చాలా ప్రయత్నాలే చేస్తోంది.