Movies

నిఖిల్ గురించి మీకు తెలియని మూడు నమ్మలేని నిజాలు

Nikhil Siddhartha Biography | Unknown Facts About Nikhil Siddhartha

ఇండస్ట్రీలో ఫుల్ సపోర్ట్ తో వచ్చి నిలదొక్కునేవాళ్ళు,మధ్యలోనే వెళ్లిపోయేవాళ్లూ ఉంటారు. ఇక ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కాలుపెట్టి నిలదొక్కునేవాళ్ళు చాలా కొద్దీ మంది మాత్రమే.

అందునా వారసుల హవా నడుస్తున్న ఈసమయంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలా నిలదొక్కుకున్నవాళ్లలో యువ హీరో నిఖిల్ ఒకడు. ఏకంగా 16సినిమాలు చేసిన నిఖిల్ కి ఏడు సినిమాలు విజయాన్ని అందించాయి.

ఈమధ్యే ఓ ఇంటివాడు కూడా అయ్యాడు. హ్యాపీ డేస్ మూవీస్ తో ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరుతెచ్చుకున్న నిఖిల్ మధ్యలో అపజయాలు ఎదురైనా నిలబడ్డాడు.

1985జూన్ 1న బేగంపేటలో జన్మించిన నిఖిల్ అసలు పేరు నిఖిల్ సిద్దార్ధ్ . తల్లి బేగంపేట, తండ్రి గద్వాల్.బడికి వెళ్లడం అంటే పెద్దగా ఇష్టంలేని నిఖిల్ ఎక్కువగా ఇంటిలోనే ఉండేవాడు. మొత్తానికి పదవతరగతి 99శాతం మార్క్స్ తో పాసయ్యాడు.

ఇంటరయ్యాక ఎంసెట్ రాంక్ తెచ్చుకుని,ఇంజనీరింగ్ చేసాడు. అదేసమయంలో విడుదలయిన ఖుషి మూవీచూసి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయ్యాడు. సినిమాల్లో చేరాలని ఎన్నో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు.

నటనలో నాలుగేళ్లు శిక్షణ కూడా పొందాడు. ఈలోగా గూగుల్ లో వచ్చిన ఉద్యోగం కూడా వదిలేసాడు. మొత్తానికి హ్యాపీడేస్ లో నటులు కావాలని యాడ్ చూసి వెళ్ళాడు.

ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు. నలుగురు హీరోల్లో ఒకడిగా ఉంటావని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పాడు.

సరేనని అందులో స్టూడెంట్ మాస్ క్యారెక్టర్ లో తన నటనతో అదరగొట్టాడు. తర్వాత అంకిత్ పల్లవి అనే సినిమాలో సోలో హీరోగా చేసాడు.

అది బాగోలేదు. తర్వాత యువత మూవీలో చేసి హిట్ కొట్టాడు.

తర్వాత చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఇక డిప్రెషన్ కి గురవుతున్న సమయంలో స్వామి రారా మూవీ చేసి హిట్ కొట్టాడు.

2014లో కార్తికేయ మూవీలో చేసి ఘనవిజయం అందుకున్నాడు. సూర్య వెర్సెస్ సూర్య కూడా విజయాన్ని అందుకుంది.

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత కేశవ్ మూవీ ,ఆతర్వాత కిరాక్ పార్టీ రీమేక్, అర్జున్ సురవరం రీమేక్ మూవీ