Movies

త్వరలో టీవి సీరియల్ అభిమానుల కష్టాలు తీరబోతున్నాయి

మహమ్మారి కరోనాతో అన్ని నిల్చిపోయినట్టే టివి షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీంతో బుల్లి తెర నటీనటులు,మేకర్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన సీరియల్ భాగాలే వేస్తూ కొన్నాళ్ళు కాలక్షేపం చేసినా రేటింగ్స్ లేవు.

ఆడియన్స్ కూడా చూసిన సీరియల్స్ భాగాలే చూడాలంటె బోర్ గానే ఫీలవ్వడం ఇందుకు కారణం.

దాదాపు రెండు నెలలకు పైనే నిలిచిపోయిన షూటింగ్స్ ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులతో ప్రారంభం కానున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే బుల్లితెర కష్టాలు గట్టిక్కుతాయని అంటున్నారు.

కేంద్రం ఇచ్చిన సడలింపులతో రాష్ట్రాల్లో కూడా మరిన్ని సడలింపులు వస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో షూటింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

అటు తెలంగాణ,ఇటు ఏపీలో కూడా షూటింగ్స్ కి పరిమిషన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పెద్ద సినిమాల షూటింగ్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపో ఎల్లుండో షూటింగ్స్ జరగబోతున్నాయన్న వార్తలోస్తున్నందున ఇక టివి షూటింగ్స్ మొదలుకానున్నాయి. అప్పుడు గానీ బుల్లితెర నటుల కష్టాలు గట్టెక్కుతాయని భావించాలి.