సినిమాల్లో రోజా రీ ఎంట్రీ .. ఈసారి పవర్ ఫుల్ విలన్ గా…!
Roja Re Entry Movie
ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై దృష్టి సారిస్తూ.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్న రోజా వైసిపి ఎమ్మెల్యేగా పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది.
నిజానికి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని,స్టార్ హోదా సొంతం చేసుకుంది.
ఆతర్వాత రాజకీయాల్లో వెళ్లి అక్కడ తనకంటూ ఫైర్ అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం పాలిటిక్స్‌తో పాటు జబర్ధస్త్ షో వంటి రియాలిటీ షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.
ఇక తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి, ‘శంభో శివ శంభో’, గోలీమార్’ సినిమాల తో సత్తా చాటింది.
ఆ తర్వాత సినిమాలపై అంతగా దృష్టి సారించలేదు. అంతేకాదు రోజా తనకు తగ్గ పవర్‌ఫుల్ రోల్ వస్తే కానీ చేయనని ఫిక్స్ అయింది.
తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర కోసం రోజాను ఎప్రోచ్ అయ్యారట.
ఈ సినిమా కథ మొత్తం నల్లమల, శేషాచలం ఫారెస్ట్ నేపథ్యంలో కొనసాగుతోంది.
మరోవైపు రోజా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఈ పాత్రకు రోజా అయితే న్యాయం జరుగుతుందని దర్శకుడు సుకుమార్,బలంగా నమ్మడంతో రోజాను కలిసి ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి వివరాలు చెప్పాడట. ఇ
క రోజా కూడా ఈ కథ నచ్చి సుకుమార్‌కు ఓకే చెప్పినట్టు టాక్. అంతేకాదు ప్రస్తుతం రోజా, రాజకీయాలతో పాటు రియాల్టీ షోలతో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం కేవలం పదిహేను రోజులు మాత్రమే డేట్స్ కేటాయిస్తా.
ఆ లోపే తన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయాలని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన పర్ఫెక్షెన్ కోసం ఎన్ని టేకులు తీసుకోవడానికైనా వెనకాడడు.
అలాంటిది పుష్ప సినిమాలో రోజా పాత్రను 15 రోజుల్లో కంప్లీట్ ఎలా చేయాలో తెలియక కాస్త అయోమయంలో ఉన్నాడట.
మొత్తానికి సుకుమార్ కూడా రోజా చెప్పిన కండిషన్స్‌కు ఒప్పుకొని ఆమె పాత్రను సాధ్యమైనంత మేర తక్కువ టైమ్‌లో షూట్ చేసేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. రోజా ఒకే అయితే విలన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.