Movies

ఆర్ ఆర్ ఆర్(RRR) కోసం భారీవ్యయంతో సెట్ – కంగుతిన్న సినీ వర్గాలు

RRR movie shooting location

స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి దర్శకత్వ ప్రతిభ చాటుతూ మగధీర.. బాహుబలి 1 .. బాహుబలి 2 చిత్రాలకు భారీగా వీ.ఎఫ్.ఎక్స్ షాట్స్ ని డిజైన్ చేయడమే గాక.. వీఎఫ్.ఎక్స్ ని సమర్థంగా ఉపయోగించడంలో ఎస్ ఎస్ రాజమౌళి సక్సెస్ కొట్టాడు.

అందుకే భారీ పాన్ ఇండియా సినిమాల్ని తెరకెక్కించడంలో పనితనం గురించి వేరే చెప్పక్కర్లేదు.

మగధీర- బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాలతో అతడు పాన్ ఇండియా డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించాడు.

ఇక వీ.ఎఫ్.ఎక్స్ పరంగా ఈగ లాంటి క్లాసిక్ సినిమా తెరకెక్కించిన ఘనత కూడా జక్కన్న కే చెల్లింది.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ రూపంలో మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.

ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను ఫిక్షనల్ గా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో విజువల్ గ్రాఫిక్స్ కి స్కోప్ అమాంతం పెరిగింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో గిరిజన విప్లవకారుడు కొమురం భీమ్ పులితో పోరాటం.. అలానే అల్లూరి సీతారామరాజు విల్లంబుల పోరాటం.. ఆంగ్లేయులపై తిరుగుబాటు .. గెరిల్లా యుద్ధం.. వీటన్నిటికీ విజువల్ ఎఫెక్ట్స్ పని చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.

ముఖ్యంగా వీ.ఎఫ్.ఎక్స్ లోనే తెల్లోళ్లు పాలించిన కోటల ప్రాకారాల్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది.

అయితే వీటన్నిటినీ ఎస్.ఎస్.రాజమౌళి ఎక్కడ సెట్ చేశారు? అంటే.. అందుకోసం హైదరాబాద్ గండికోట విలేజ్ పరిసరాల్లో భారీ సెట్లు వేసి ప్రాకారాల్ని తీర్చిదిద్దారు.

కేవలం ఆర్.ఆర్.ఆర్ కోసం గండిపేట లో రూ .18 కోట్ల విలువైన సెట్ ఇంతకు ముందే వేశారు.

ఇక్కడే మెజారిటీ షూట్ చేసారు. అనూహ్యంగా లాక్ డౌన్ వల్ల నెలరోజుల షూటింగ్ పెండింగ్ లో పడింది.

ఇప్పుడు దానిని పూర్తి చేసేందుకు రాజమౌళి ఏర్పాట్లు చేసుకున్నారు.

30శాతం పెండింగ్ షూటింగ్ ఉన్నందున, లాక్ డౌన్ ముగిశాక శరవేగంగా పూర్తి చేసేందుకు జక్కన్న స్కెచ్ చేస్తున్నాడట.