Movies

ర‌హ‌స్య పెళ్లి గురించి… న‌వదీప్ ఏమంటున్నాడు?

న‌వ‌దీప్ ఇండ్ర‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు రెండు ద‌శాబ్దాలు అయిపోతోంది. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌వి చూశాడు. డ‌క్కా ముక్కీలు తిన్నాడు. హీరో నుంచి.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుకి షిఫ్ట్ అయ్యాడు. బిగ్ బాస్ షోలో హ‌డావుడి చేశాడు. ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌పై దృష్టి పెట్టాడు. ఏ ఒక్క‌రోజూ ఖాళీగా లేడు. త‌న‌పై వ‌చ్చిన గాసిప్పులూ త‌క్కువేం కాదు. ఎవ‌రితోనో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ర‌హ‌స్యంగా పెళ్లి కూడా చేసేసుకున్నాడ‌ని ర‌క‌ర‌కాలుగా చెపుతుంటారు. వీటిపై న‌వ‌దీప్ స్పందించాడు. త‌న పెళ్లింకా అవ్వ‌లేద‌ని, తాను ఇప్ప‌టికీ బ్యాచిల‌రే అని క్లారిటీ ఇచ్చాడు. చాలాసార్లు, చాలామంది అమ్మాయిల‌తో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని, బ్రేక‌ప్పులు కూడా జ‌రిగిపోయాయ‌ని, అయినా ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్షుగా ప్రేమ‌లో ప‌డుతుంటాన‌ని చెబుతున్నాడు న‌వ‌దీప్‌.

”నా పెళ్లిపై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌లు వండి వారుస్తుంటారు. నాకింకా పెళ్లి కాలేదు. ఇంకా బ్ర‌హ్మ‌చారినే. పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్ని న‌మ్మొద్దు” అన్నాడు. ఆహా కోసం న‌వ‌దీప్ వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తున్నాడు. ఈమ‌ధ్య ‘ర‌న్‌’ అనే పేరుతో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా తీశాడు. మొత్తానికి వెబ్ సిరీస్‌ల వ‌ల్ల‌.. న‌వ‌దీప్ బాగానే వెన‌కేసుకుంటున‌ట్టు క‌నిపిస్తోంది.