తెలుగులో మొదటి ఫ్యాక్షన్ డ్రాప్ మూవీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. అలాగే ఒకప్పుడు వరుసగా ఫ్యాక్షన్ డ్రాప్ లో సినిమాలు వరుసపెట్టి వచ్చాయి. సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఆది… చెన్నకేశవరెడ్డి … ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ సినిమాలు దర్శకత్వం బి.గోపాల్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇతన్నే ఫ్యాక్షన్ సినిమాలకు ఆద్యుడు అని కూడా అంటుంటారు..కానీ కృష్ణవంశీ తీసిన అంతఃపురం మూవీ కూడా ఫ్యాక్షన్ డ్రాప్ లోనే వచ్చింది. వీటన్నింటి కంటే ముందు కొన్నేళ్ల క్రితం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా వచ్చింది.. అదే “ఊర్వశి” శారద ప్రధాన పాత్రలో , తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “కడప రెడ్డెమ్మ” మూవీ.
కడప రెడ్డమ్మ సినిమాలో ఊర్వశి శారద ప్రధాన పాత్ర పోషించగా, మోహన్ బాబు, ఆనంద్, రంజిత,చలపతిరావు, నర్రా వెంకటేశ్వర్రారు, గిరిబాబు, అన్నపూర్ణ ఇతర పాత్రల్లో నటించారు…తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో 1990 లో వచ్చిన ఈ చిత్రాన్ని చలపతిరావు ప్రొడ్యూస్ చేసాడు. మాటల మాంత్రికులు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు పదునైన డైలాగ్స్ అందించారు. పాటల పరంగా కొంచెం సోసోగా సాగినప్పటికి ప్రధాన నటుల నటన అందరిని ఆకట్టుకుని సినిమా అందరికి నచ్చే విధంగానే ఉంటుంది..
వారికి పుట్టిన బిడ్డని రక్షించుకోవడం కోసం కడప రెడ్డమ్మ ఊరి పెద్దలపై తిరుగుబాటు చేస్తుంది ..ప్రేమజంటగా ఆనంద్, రంజిత నటించారు, ఆనంద్ వదినగా శారద, తండ్రిగా చలపతిరావు నటించగా …రంజిత అన్నగా మోహన్ బాబు, తాతగా నర్రా చేసారు. పారిపోయి వచ్చిన ప్రేమజంటకి ఆశ్రయం ఇచ్చే పాత్రలో అన్నపూర్ణ చేసింది. మోహన్ బాబు,చలపతిరావు వారి ముఖ కవలికల్లోనే విలనిజాన్ని పండించారు. గడపలోపలే ఉండే ఆడది ఆదర్శాలు వల్లిస్తే ఎలా అంగీకరిస్తారు అంటూ వచ్చే కొన్ని పదునైన డైలాగులు పరుచూరి సోదరులు సంధించి జనాల్లో ఆలోచన రేకెత్తేలా చేసారు. అయితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది తొలిమూవీ అని చాలామందికి తెలీదు.