Movies

ఎపిసోడ్ రేటు పెంచేసి షాకిస్తున్న వంటలక్క

సినిమాలతో సమానంగా బుల్లితెరకు డిమాండ్ ఉంది. అందునా తెలుగులో టివి సీరియల్స్ లో నటించేవాళ్లకు యమక్రేజ్ ఉంటోంది. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ క్యారెక్టర్స్ కు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ కి పురుషుల్లో సైతం పెద్ద ఎత్తున అభిమానులున్నారు. అందుకే సీరియల్స్ లో టాప్ రేంజ్ లో రాణిస్తున్న కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సీరియల్ దెబ్బతో మిగతా చానెల్స్ వారికి పోటీ భారీ రేంజ్ లో పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లను సైతం పక్కన పెట్టేయడమే కాదు, ఇంట్లో ఎవరూ టివి మార్చకుండా ఉండేలా ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోళ్లను దాచేసి మరీ మహిళా ప్రేక్షకులు ఈ సీరియల్ ఫాలో అవుతుంటారు.

మరి ఇంతలా ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు ఈ లెవెల్లో పేరు రావడానికి దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ కీలకంగా చెబుతారు. దీప, కార్తీక్ మధ్య ఉన్న దాంపత్య బంధమే ఈ సీరియల్ సక్సెస్ కి కారణం అంటారు. అలాగే వంటలక్క క్యారెక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ లేకపోయినప్పటికీ ఆమెకు మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వంటలక్క అలియాస్ దీప క్యారెక్టర్ కు పారితోషికం ఎంత ఇస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే తెలుగు కన్నా ముందే ఈ సీరియల్ మళయాలంలో కారుముత్తు పేరిట ప్రసారమై 7 సంవత్సరాలు నిరాఘాటంగా నడిచి,ముగింపు పలికించారు. ఆ సీరియల్ లో సైతం లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్‌ తెలుగులోనూ సత్తా చాటింది.

మళయాళంలోఒక్కో ఎపిసోడ్ కు రూ.15 వేల వరకూ ప్రేమి విశ్వనాథ్ పారితోషికం అందుకుందని టాక్. అయితే తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటోందని టాక్ ఉంది. ముఖ్యంగా తెలుగులో బుల్లితెరపై ఏ ఆర్టిస్ట్ కూడా అందుకోని రేంజులో ఈమె చార్జ్ చేస్తుందని టాక్. కార్తీక దీపం సీరియల్ కు ఒక్కో ఎపిసోడ్ కు కనీసం 1 లక్ష రూపాయలు రాబట్టుకుంటోందట. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వంటలక్క 3 నెలలు గ్యాప్ సీరియల్స్ ఆగిపోవడంతో ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనుంది. అయితే తన రెమ్యునరేషన్ పెంచాలని పట్టుబట్టిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా తనకు ఒక్కో ఎపిసోడ్ కు రూ. 3 లక్షలు కావాలని డిమాండ్ చేయగా, నిర్మాతలు కూడా అందుకు పెద్దగా బేరం ఆడకుండానే ఓకే చెప్పేసారట. అసలే లాక్ డౌన్ కారణంగా దెబ్బతినేసిన నేపథ్యంలో ఇంతమొత్తం డిమాండ్ చేయడం,ఒకే చేయడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది.