లాక్‌డౌన్ ముగిస్తే,… హీరోల మధ్య వార్ తప్పదా…?
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా తో వరల్డ్ వైడ్ స్థితిగతులు మారిపోయాయి. అన్ని దేశాల్లో కరోనా విజృంభణ జోరుగానే ఉంది. కరోనాతో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం మూతపడింది. దాంతో చాలా సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని కూడా విడుదల కాకుండా వాయిదా పడిపోయాయి. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యాయి. అవెప్పుడు వస్తాయో కూడా తెలియని విచిత్రమైన స్థితి నెలకొంది. థియేటర్లు తీస్తే,మొదటగా పెద్ద సినిమాలకయితే పర్వాలేదు. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఇప్పుడు థియేటర్స్ దొరికే ఛాన్స్ లేదు. వాళ్ళ సినిమాలు అసలు విడుదల కావడం కూడా కష్టమే. పైగా లాక్ డౌన్ తర్వాత రాబోయే రోజులు మరింత గడ్డుగా మారనున్నాయి. సెలవుల్లో కూడా కోత పడనుంది.ఇప్పుడు వచ్చిన నష్టాలను భరించడానికి తర్వాత సెలవులకు ప్రభుత్వం కోత పెడుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఇలా చూసుకుంటూ పొతే, ఇప్పటికే సమ్మర్ సీజన్ అంతా కరోనాకు బలైపోయింది. ఎప్పుడూ వరస సినిమాలతో కళకళలాడుతూ ఉండే సమ్మర్ సీజన్.. ఈ సారి మాత్రం ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. అంతేకాదు, రాబోయే మూన్నెళ్ల వరకు కూడా కొత్త సినిమాల విడుదల తేదీలు ఉండకపోవచ్చు. దసరా సీజన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడూ వరస సినిమాలతో కళకళలాడుతూ ఉండే సమ్మర్ సీజన్.. ఈ సారి మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక రాదు కూడా.. రాబోయే మూన్నెళ్ల వరకు కూడా కొత్త సినిమాల విడుదల తేదీలు ఉండకపోవచ్చు. ఒక్కసారి లాక్ డౌన్ అయిపోతే కచ్చితంగా సినిమాలన్నీ ఒకేసారి బాక్సాఫీస్‌పై దండెత్తడం ఖాయం. ఇప్పటికే నాని ‘వి’,.. అనుష్క ‘నిశ్శబ్ధం’,.. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరూ’.. వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాలు వాయిదాపడ్డాయి.
మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే చిన్న మూవీస్ ఎప్పుడు వస్తుందో తెలీని ప్రశ్నే. అలాగే నాగ చైతన్య లవ్ స్టోరీ.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. నాగార్జున వైల్డ్ డాగ్.. వెంకటేష్ నారప్ప.. బాలయ్య, బోయపాటి సినిమా.. చిరంజీవి ఆచార్య కూడా విడుదల తేదీలు వాయిదా తప్పని పరిస్థితి. ఇప్పటికే ఆచార్య సినిమా 2020 నుంచి బయటికి పోయి,2021 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్.ఇక బాలయ్య బోయపాటి సినిమా కూడా డిసెంబర్‌కు వాయిదా పడేలా కనిపిస్తుంది. థియేటర్స్ కోసం హీరోలంతా కొట్టుకుంటారేమో..? కచ్చితంగా మరో ఆర్నెళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది.. మరో ఏడాది వరకు నష్టాలు కంటిన్యూ తప్పదు. అణుడికే టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్వ వైభవం అంతసులువు కాదని అంటున్నారు.