Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తెలుగులో కొంతవరకే పరిమితమై,ఆతర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన కుష్బూ.. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. దాంతో పాటే మంచి కథలు వచ్చినపుడు అందుకు తగ్గ పాత్రలు ఎంచుకుని మరీ నటిస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్త సినిమాలో ఖుష్బూ నటిస్తోంది. ఇక బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ ఇప్పుడు అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. లాక్‌డౌన్ పుణ్యమా అని ఈ సీనియర్ హీరోయిన్ ఏకంగా మూడు నెలల్లోనే 15 కిలోలు తగ్గిపోయి షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది .

లాక్‌డౌన్ ముందు వరకు కూడా బొద్దుగా ముద్దుగా ఉన్న నటి ఇప్పుడు మాత్రం చాలా సన్నబడిపోయింది. 15 కిలోలు తగ్గి కుర్ర హీరోయిన్‌లా మారిపోయింది. 15 కిలోల బరువు తగ్గడమేమో కానీ ఇప్పుడు ఖుష్బూను చూస్తుంటే ఏకంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినా కూడా ఏ మాత్రం తరగని అందంతో ఆమె అందరికీ షాక్ ఇస్తుంది. ఇన్ని కిలోలు సన్నబడిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఖుష్బూ లుక్ చూసి, ఫ్యాన్స్ షాకవుతున్నారు. అబ్బో ఏమి అందం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.