Movies

ప్రభుదేవా పెట్టిన ఆ షరతుల వల్లే ..నయనతార పెళ్ళి కాస్త పెటాకులైందా ..?

ఒక్క ఓవర్ నైట్ లోనే ఆమెకు స్టార్ డం రాలేదు. ఆమె ప్రతిభ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ హీరోయిన్స్ లో నయనతార ఒకరు.కమర్షియల్ సినిమాల్లో నటించినా, చీరకట్టులో మన ఇంటి ఆడ పిల్లలా కనిపించినా ,లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేసిన అది ఒక్క నయనతార మాత్రమే అని చెప్పవచ్చు.

స్టార్ హీరోల సినిమాల రేంజ్ లోనే నయనతార సినిమాలు కూడా నిర్మాతలకు భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి.35 ఏళ్ల వయసు వచ్చినా వన్నె తరగని అందం నయనతార సొంతం. ఆమె జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన దారిన తను ముందుకు వెళ్తూనే ఉంది. ఇక తన జీవితంలో సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను నయనతార పేస్ చేసింది. మొదట తమిళ నటుడు శింబుతో తర్వాత యాక్టర్ అండ్ డాన్సర్ ప్రభుదేవాతో నయనతార లవ్ ఫెయిల్యూర్ చవిచూసింది .

వీరిద్దరిలో ప్రభుదేవాతో నయనతార పెళ్లి పీటలు వరకు వచ్చింది,కానీ ప్రభుదేవా మొదటి భార్య వల్ల వారి పెళ్లి చేసుకోకుండా విడిపోవడం అందరికీ తెలిసిన విషయమే.ఇక శింబుతో లవ్ పెళ్లి పీటలు వరకు వచ్చినా శింబు తండ్రి అయినా Tరాజేంద్ర వారి పెళ్లికి నిరాకరించడంతో ఆ లవ్ స్టోరీ కూడా ఫెయిల్ అయింది. నయనతార ఓ మీడియా ఇంటర్వ్యూలో చెబుతూ నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు .

నమ్మకం లేకుండా కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిది అని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా శింబుల తో ఆమె విడిపోవడానికి అదే కారణమని ,ఆ టైంలో ఆమె ఎంతో మనో వేదనకు గురి అయినట్టు చెప్పుకొచ్చింది.
ఈ విషయంలో మీడియా తో నేను నోరు మెదపక పోవటం తో వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశారు. అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. శింబుతో విడిపోయిన, ప్రభుదేవాతో ప్రేమాయణం బాగానే సాగిన తర్వాత కొన్నాళ్లకు ప్రభుదేవా పెట్టిన కండిషన్కు నయన తార ఈ ప్రేమకు కూడా స్వస్తి చెప్పింది. తను క్రిస్టియన్ గా ఉన్నా ప్రభుదేవా కండిషన్స్ వల్ల హిందువు గా మారిందట .ఆ తర్వాత ప్రభుదేవా ఆధిపత్యం మరియు షరతులు వీటివల్ల బంధం కాస్త బీటలు పారిపోయింది.