రాజ్-కోటి గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎందుకు విడిపోయారో…?
ఒకప్పుడు ఆలిండియా రేడియోలో వచ్చే పాటలంటే ఆనాటి కుర్రకారుకి చెప్పలేని మోజు. ఎవరు పాడారు,హీరో ఎవరు ఇవన్నీ పక్కన పెట్టేసి ,ఫలానా వారి మ్యూజిక్ అని వస్తే చాలు ఆ సాంగ్స్ వినేయ్యల్సిందే. అలా ఓ దశాబ్దం పాటు కుర్రకారును హోరెత్తించిన సంగీత ద్వయం రాజ్ కోటి. కొదమసింహాలో జపం జపం ,యముడికి మొగుడులో వానజల్లు గిల్లుతుంటే, కన్నె పెట్టరో కన్ను కొట్టారో,స్వాతిలో ముత్యమంత… గజ్జ ఘల్లు మన్నదో, మేఘమా మరువకే, నీతో సాయంత్రం ఎంతోసంతోషం ఇలాంటి ఎవర్ గ్రీన్ పాటలెన్నో రాజ్ కోటి బాణీలే. సంగీతాన్ని బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అన్నీ కొత్త కొత్త ఇనిస్ట్రి మెంట్స్ వాడేవారు. ముఖ్యంగా ముఠామేస్త్రీలో ఎంత ఘాటు ప్రేమయో పాటకు వాడిన వాయిద్యాలు చూసి అందరూ కంగుతిన్నారు.
హలొ బ్రదర్ మూవీ సాంగ్స్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా నంది అవార్డు కొట్టారు. గాడ్ ఫాథర్ మూవీ వీరి కాంబోలో వచ్చిన చివరి సినిమా. ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ కీబోర్డు ప్లేయర్ గా పనిచేసాడు. ఇక ఇండస్ట్రీలో కొందరు సృషించిన అపోహల వలన వీరిద్దరూ విడిపోయారు. వీరి అసలు వివరాల్లోకి వెళ్తే,… అలనాటి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అబ్బాయి కోటేశ్వరరావు అలియాస్ కోటి. ఇంకో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ టివి రాజు కొడుకు సోమరాజు అలియాస్ రాజ్. రాజ్ – కోటి ఇద్దరూ అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్స్ గా చేసేవారు. ఇక 1984లో ప్రళయ గర్జన మూవీకి రాజ్ కోటి సంగీతం అందించే ఛాన్స్ వచ్చింది. నిజానికి రాజ్ కి ఛాన్స్ వస్తే, ఇద్దరం కల్సి చేద్దామని ఒప్పించి మరీ ఇద్దరూ చేసారు. హాలీవుడ్ సంగీతం తెలుగులో ఇవ్వాలని వీరికి ఉండేది. మదన గోపాలుడు, సాహసం చేయరా డింభకా, చిక్కడు దొరకడు లాంటి మూవీస్ గుర్తింపు తెచ్చాయి.
ఇక 1988లో తొలిసారి సుప్రీం హీరో చిరంజీవితో చేసే ఛాన్స్ దక్కడంతో యముడికి మొగుడు మూవీలో రాజ్ కోటి తమ విశ్వరూపం చూపించారు. అందం హిందోళం,వానజల్లు గిల్లుతుంటే,వంటి పాటలు బంపర్ హిట్స్ అయ్యాయి. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక బజారు రౌడీ,లంకేశ్వరుడు,పల్నాటి రుద్రయ్య ,బాలగోపాలుడు,విక్కీ దాదా, కొడుకు దిద్దిన కాపురం,టు టౌన్ రౌడీ ఇలా వరుస హిట్స్ తో రెండేళ్లలోనే టాప్ ప్లేస్ కి వచ్చేసారు. ఇళయరాజా కూడా బీటౌట్ చేశారా అనే దశకు చేరారు. ఇక కొదమ సింహం మూవీతో రాజ్ కోటి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. చిరంజీవి సినిమాలకు రాజ్ కోటి సంగీతంతో చెలరేగిపోయి ఇండస్ట్రీని ఏలారు. ముఠామేస్త్రి,మెకానిక్ అల్లుడు,దొంగ అల్లుడు,బావ బావమరిది, హలొ బ్రదర్,నిప్పురవ్వ,సీతారత్నం గారబ్బాయి,ఇలా ఎన్నో హిట్స్ అందించారు.