Movies

రానా తమ్ముడు అభిరాం హీరో కాకుండా అడ్డు పడుతున్నది ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో వారసత్వానికి కొదవలేదు. అన్ని పెద్ద ఫ్యామిలీస్ నుంచి హీరోలు వచ్చేస్తున్నారు. మెగాస్టార్ ఫామిలీ నుంచి ఏకంగా డజనుమంది వరకూ వచ్చేసారు. అలాగే మిగిలిన ఫ్యామిలీస్ నుంచి కూడా ఒకరిద్దరు వస్తూనే ఉన్నారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో చెప్పుకోదగ్గ దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్పటికే వెంకటేష్‌ హీరోగా ఉండగా, నిర్మాత సురేష్ బాబు పెద్ద కొడుకు రానా కూడా హీరో అయ్యాడు. ఇక సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ హీరో అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట.

దీనికి తోడు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అభిరామ్‌ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.హీరో అవుతాడు అనుకుంటున్న సమయంలో శ్రీరెడ్డి ఇష్యూతో అతడి సినీ కెరీర్‌ మొదలు కాకుండానే గందరగోళంలో పడిపోయింది. తాజాగా మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు జయంతి సందర్బంగా ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించిన సందర్బంగా ఆ కార్యక్రమంలో అభిరామ్‌ హాజరయ్యాడు.

తన తాత గారితో తన జ్ఞాపకాలను అభి నెమరవేసుకున్నాడు.తాతయ్య బతికి ఉంటే నేను ఇప్పటి వరకు హీరోను అయ్యేవాడిని అంటూ అభిరామ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారితీసాయి. హీరో అవ్వాలనుకుంటున్న అభిరామ్‌ను తండ్రి సురేష్‌ బాబు అడ్డుకుంటున్నాడా అంటూ కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుత ఇష్యూ కారణంగా హీరో అయినా మరింత వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తారని, దాంతో పరువు పోతుందని సురేష్‌ బాబు ఆలోచిస్తున్నాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే కొడుకుపై అభిమానం ప్రేమ ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెనకడుగు వేయిస్తున్నాడన్న టాక్ వస్తోంది.