Movies

మౌనరాగం సీరియల్ లో రీ ఎంట్రీ ఇస్తున్న అంకిత్

మౌనరాగం సీరియల్ లో ఒక భిన్నమైన కథతో ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన జంట అంకిత్,అమ్ములు. అయితే సీరియల్ లో అంకిత్ హఠాత్తుగా మరణించటం,అనురాగ్ అనే క్యారెక్టర్ ని తీసుకురావటంతో అంకిత్ లేని సీరియల్ ని చూడలేక అభిమానులు నిరాశలో ఉన్నారు.

జూన్ 7 న అంకిత్ పుట్టినరోజు కావటంతో ఇంస్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో మాట్లాడుతూ ఎప్పటిలాగానే లవర్ బాయ్ గా అలరించడానికి ముందుకు వస్తున్నాను అంటూ తన మాటల్లోనే క్లారిటీ ఇచ్చేశాడు అంకిత్. అలాగే ఇటీవల స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో అనురాగ్ కి అమ్ములు దగ్గర అవుతున్న వేళా అంకిత్ తిరిగి వస్తే అంటూ చూపించారు. కాబట్టి అంకిత్ రీ ఎంట్రీ కన్ఫమ్ అయినట్టే.