చైతు తొలిప్రేమ బ్రేకప్ స్టొరీ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
అక్కినేని వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున తనయుడు నాగ చైతన్య తనదైన టాలెంట్ చూపిస్తూ సినిమాల్లో స్టార్ హీరో కావడానికి శ్రమిస్తున్నాడు. ఇక స్టార్ హీరోయిన్ సమంతను పెళ్ళాడి,ఇద్దరూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నారు కూడా. ఏం మాయ చేసావే మూవీతో సమంతతో నటించి,ఆమెతో ప్రేమలో పడి,మునిగి తేలిన చైతన్య ఆతర్వాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అయితే చైతూకి ఇదే మొదటి ప్రేమ కాదట. అంతకు ముందే లవ్ స్టోరీ ఉందట.
స్కూల్స్ డేస్ లోనే ఓ అమ్మాయితో ప్రేమలో పాడ్డాక ఆ అమ్మాయి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోవడంతో ఇలా ఎందుకు చేసావని నిలదీశాడట. ఆతరువాత కాలేజీలో చదివేటప్పుడు టీనేజ్ లో ఓ అమ్మాయిపై చైతు మనసు పారేసుకున్నాడట. కానీ ఇంట్లో అమ్మా నాన్న పద్ధతులు తెలిసాక ముందడుగు వేయలేక పోయాడట. అయితే చాలా సార్లు ఇది గుర్తొచ్చి ఇలా ఎందుకు చేసానా అని ఆలోచనలో పడేవాడట.
ఇక 2009లో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతు కి అనుకోకుండా ఆతర్వాత సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏం మాయ చేసావే సినిమాతో ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లివరకూ నడిపించేసింది. దాంతో సినిమాల్లో కూడా విజయాలు వరిస్తూ వస్తున్నాయి. అయితే రియల్ లైఫ్ లో జరిగిన ఘటన లాంటి స్టోరీ తో కూడిన సినిమాలో అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్నాడు. నిజంగా థ్రిల్ గానే ఉంటుంది కదా.