Movies

రాఘవేంద్ర రావు ఆ హీరోయిన్స్ ఎందుకు వదిలేసాడో తెలుసా ?

హీరోయిన్ ని గ్లామర్ గా చూపించడంలోనూ,శృంగార నాయికగా మలచడంలోనూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్టైల్ ఎవరికీ రాదనే చెప్పాలి. ఎన్టీఆర్ మొదలుకుని అల్లు అర్జున్,మహేష్ బాబు ఇలా అందరితో పనిచేసిన దర్శకేంద్రునికి టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఇటీవల సినిమాలు తగ్గించారు. ఆయన కేవలం భక్తి చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు.కాగా సినిమాల్లో హీరోయిన్‌ల అందాలను తనదైన శైలిలో చూపించడంలో దర్శకేంద్రుడు స్పెషాలిటీ వేరు.

ముఖ్యంగా హీరోయిన్ నడుమందాలను చూపించడంలో దర్శకేంద్రునికి ఎవరూ సాటిరారు. హీరోయిన్ల నడుముపై ఆయన పలు రకాల పండ్లు, పూలతో కొట్టడం అప్పట్లో ఒక సరికొత్త ట్రెండ్‌సెట్టర్ అయింది. కేవలం ఈ సీన్స్‌ను చూసేందుకు చాలా మంది థియేటర్లకు కూడా వచ్చేవారంటే అతిశయోక్తి కాదు రాఘవేంద్ర రావు దాదాపు అందరు హీరోయిన్ల నడుముపై ఈ ఫీట్ చేశారు.కానీ ఇద్దరు హీరోయిన్లను మాత్రం ఈ ఫీట్ నుండి మినహాయింపు ఇచ్చారు.

వాళ్లెవరో చూస్తే, … జయప్రద, జయసుధ అని తేలింది. నిజానికి వీరిద్దరూ కూడా దర్శకేంద్రుడితో అనేక సినిమాల్లో నటించిన హోమ్లీ బ్యూటీస్ గా నిలిచారు. వీళ్ళ నడుముపై ఎప్పుడూ దర్శకేంద్రుడు ప్రయోగం చేయలేదు. ఇందుకు చాలా పెద్ద బలమైన కారణం ఉందట. వారిద్దరిని చూస్తే ఇలా చేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ రాలేదట. అందుకే నడుమందాల ఆరబోతలో జయసుధ, జయప్రదలకు మినహాయింపు లభించిందని ఆయన తెలిపారు. వారిద్దరు సహజ నటీమణులని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.