Movies

వకీల్ సాబ్ సినిమాలో చాలా మార్పులు చేస్తున్నారట…నిజమేనా?

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల రెండున్నర నెలలుగా షూటింగులు ఆగిపోగా, సినిమా థియేటర్లు నిలిచిపోయాయి. దీంతో సెలబ్రిటీలు సైతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఇస్తున్న సడలింపులతో ఒక్కొక్కరుగా బయటికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా మొదలైంది రవిబాబు సినిమా ఒక్కటే. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ పైనే ఉంది. ఇంకో నెల రోజులు ఏకధాటిగా కొనసాగితే, షూటింగ్ పూర్తయిపోతుంది. ఎలాగూ ఆల్రెడీ షూట్ చేసిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. ఫైనల్ షాట్ కాగానే తక్కువ టైంలోనే ఫస్ట్ కాపీ రెడీ చేయొచ్చు.

ఇంకా అసలైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలన్స్ ఉంది. ఈ పార్ట్ కి హీరోయిన్ కోసం శృతి హాసన్ అనుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఏదో సోషల్ మీడియా చాట్ లో ‘నేను లేను’అని ఈ అమ్మడు చెప్పింది అయితే మరికొన్ని సంప్రదింపుల తర్వాత శృతి ఓకే చేసినట్లు టాక్ వస్తోంది. కేవలం 11 రోజుల షూట్ కు 50 లక్షల పారితోషికం ఆఫర్ చేశారట. ఈ విషయంపై ప్రస్తుతానికి యూనిట్ నుంచి కానీ దర్శకుడి నుంచి కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి సెట్లో పాల్గొంటాడు అనే దాని గురించి క్లారిటీ లేదు. అసలే హైదరాబాద్ లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్లు బయటికి వచ్చేందుకు నో అంటున్నారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రభుత్వ నిబంధనలు ఎంత పాటించినా మన అదుపులో ఉండని కొన్ని ఫ్యాక్టర్స్ అప్పటికప్పుడు ఎదురు పడితే ఇబ్బందేనని స్టార్స్ చెప్పేమాటగా ఉందట. అందుకే ఇంకోద్దిరోజులు వేచి చూద్దామనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈలోగా అభిమానుల కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కాస్త తగ్గించి ఇప్పటికే తీసిన ఫైట్ తో పాటు మరో చిన్న యాక్షన్ బ్లాక్ జోడించేలా స్క్రిప్ట్ లో స్వల్ప మార్పులు చేస్తున్నారట. సీరియస్ కోర్ట్ డ్రామా కావడంతో వాటిని కూడా కుదిస్తారట. మొత్తానికి వకీల్ సాబ్ కు సంబంధించిన వర్క్ అయితే జరుగుతోంది. ఈ మూవీ దసరాకు కుదరకపోతే,2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.