Movies

నాగబాబు అదిరింది షో వదిలేయడానికి అసలు కారణం ఇదే…ఎవరు నమ్మలేరు

ఈటీవీ జబర్దస్త్‌ కామెడీ షో నుండి మెగా బ్రదర్‌ నాగబాబు బయటకొచ్చేసి,జి తెలుగులో చేరి,అదేటైప్ కామెడీ షో స్టార్ట్ చేసిన సంగతి తెల్సిందే. జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షో చేస్తున్నాడు. ఆ కామెడీ షోకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేదు. పైగా కమెడియన్స్‌ చేసే కామెడీ మొత్తం ఒక్కటే అయినా కూడా జబర్దస్త్‌కు వచ్చిన పేరు మాత్రం అదిరిందికి రాలేదు అని చెప్పక తప్పదు. అందుకే జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చి తప్పు చేశాడేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ అలాంటి వ్యాఖ్యలు రావడానికి కారణం అయితే ఉంది. ఎందుకంటే, అదిరింది షో అంతంత మాత్రంగా నడుస్తున్న సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. దీంతో లాక్‌డౌన్‌ విధించిన కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్‌ చేయలేదు.ఇటీవల మళ్లీ షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ అదిరింది టీం మాత్రం ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు.

ఇలా అనుమానాలు వ్యక్తం కావడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే, అదిరింది కామెడీ షో నుంచి నాగబాబు బయటకు వచ్చేసాడన్న టాక్ వినిపిస్తోంది. ఈమేరకు వైరల్ కూడా అవుతోంది. ఎందుకంటే,…నాగబాబుకు ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది.దాని కోసం ప్రత్యేకంగా కామెడీ స్కిట్స్‌ను తయారు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆసక్తి ఉన్న కమెడియన్స్‌ సంప్రదించాలంటూ ఇటీవలే ప్రకటన చేశాడు. మొత్తానికి సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో కామెడీ షో ప్రారంభించబోతున్నాడు.